రివ్యూ: గల్లీరౌడీ

0
4736
Sandeep Kishan Gully Rowdy movie review and rating

Movie: Sandeep Kishan Gully Rowdy Review
Gully Rowdy Rating: 2.5/5

జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా వ‌రుస‌గా సినిమాలు చేస్తున్న యువ క‌థానాయ‌కుల్లో సందీప్‌కిష‌న్ (Sandeep Kishan) ఒక‌రు. ఆయ‌న ‘తెనాలి రామ‌కృష్ణ బి.ఎ, బి.ఎల్‌’ త‌ర్వాత మ‌రోసారి జి.నాగేశ్వ‌ర్‌రెడ్డి కాంబినేషన్‌లో చేసిన చిత్రం ‘గల్లీరౌడీ’. కోన వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ నిర్మించిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘గల్లీ రౌడీ’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమాతో సందీప్ ఎంతవరకు మెప్పించాడో చూసేద్దామా.

కథ:
వాసు (సందీప్ కిషన్) వాళ్ళ తాత గారు వెంకట్రావు (రాజేంద్రప్రసాద్) దగ్గర పెరుగుతాడు. పోయిన తన కుటుంబ పరువుని మళ్లీ నిలబెట్టడానికి రౌడీ గా మారతాడు వాసు. కానీ తమ పేరు మీద ఉన్న ఒకే ఒక్క ల్యాండ్ బాగా పలుకుబడి ఉన్న ఒక పెద్ద లోకల్ డాన్ రఘు నాయక్ (బాబీ సింహా) చేతికి చిక్కుతుంది. వాసు మరియు వెంకటరావు తమ ల్యాండ్ ని తిరిగి తీసుకోవడానికి ఏం చేశారు? అసలు రఘు నాయక్ ఆ పొలం ఎందుకు కావాలి అనుకుంటున్నాడు? చివరికి ఎవరు గెలిచారు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్
వినోద ప్రధాన కథ కావడం
ఆకట్టుకునే సంభాషణలు
నిర్మాణ విలువలు

మైనెస్ పాయింట్
కథలో కొత్తదనం లేకపోవడం
భారీగా ఉన్న యాక్షన్ సీన్స్

Gully Rowdy Telugu movie Review and rating
Gully Rowdy Telugu movie Review and rating

నటీనటులు:
సందీప్‌కిష‌న్ త‌న న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంటాడు. వాసు పాత్రలో సుల‌భంగా ఒదిగిపోయాడు. రౌడీ పాత్ర అయినప్పటికీ సందీప్ కిషన్ ఒక మాస్ హీరోగా మాత్రం మెప్పించలేకపోయాడు. రాజేంద్ర‌ప్ర‌సాద్ న‌ట‌న స్పెషల్‌. సినిమాలో కీల‌క పాత్ర పోషించిన ఆయ‌న త‌న‌దైన అనుభ‌వంతో మామూలు స‌న్నివేశాల్లోనూ న‌వ్వించారు. తన పాత్రకి పెద్దగా ప్రాధాన్యత లేకపోయినప్పటికీ నేహా శెట్టి తన పాత్రలో బాగానే అలరించింది.

వైవా హ‌ర్ష‌, వెన్నెల కిషోర్‌, ష‌క‌లక శంక‌ర్ త‌దిత‌రులు చేసిన సంద‌డి కూడా న‌వ్వించింది. మిమి గోపి ప్ర‌ధాన ప్ర‌తినాయ‌కుడిగా న‌టించాడు. ద్వితీయార్ధంలో బాబీ సింహా పాత్రే కీల‌కం. సాంకేతిక విభాగాల్లో సాయివెంక‌ట్, చౌర‌స్తా రామ్ సంగీతం మెప్పిస్తుంది. ఎంప్రెస్ చేయలేకపోయాడు అని చెప్పుకోవాలి. చౌరస్తా రామ్ మరియు సాయి కార్తీక్ అందించిన సంగీతం బాగానే అనిపిస్తుంది. పాటల సంగతి పక్కన పెడితే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఉంది. సుజాత సిద్ధార్థ సినిమాటోగ్రఫీ పర్వాలేదనిపిస్తుంది. అక్క‌డక్క‌డా మాట‌లు మెప్పిస్తాయి. ద‌ర్శ‌కుడు జి.నాగేశ్వ‌ర్‌రెడ్డి పాత క‌థ‌ని, అదే ర‌క‌మైన పాత ప‌ద్ధ‌తుల్లో న‌డిపారు.

Chitrambhalare - Sandeep Kishan Gully Rowdy movie review and rating

విశ్లేషణ:
ఎలాంటి కొత్త‌ద‌నం లేని క‌థ‌, క‌థ‌నాల‌తో రూపొందిన చిత్ర‌మిది. న‌వ్వించ‌డమే ప్ర‌ధానంగా స‌న్నివేశాల అల్లిక క‌నిపిస్తుంది. న‌టీన‌టుల అనుభ‌వం, ర‌చ‌నా ప్ర‌భావం వ‌ల్ల ఆ ప్ర‌య‌త్నం కొంత‌మేర‌ నెర‌వేరిన‌ట్టు అనిపించినా, మిగిలిన విషయాల్లో సినిమా ఏమాత్రం ఆసక్తిని పంచలేదు. తమ కుటుంబ పెద్దలను అవమానించిన వారిపై పగ తీర్చుకునే హీరోల కథలతో చాలా సినిమాలు వచ్చాయి. కానీ ఇందులో మాత్రం హీరో కక్షలు, కార్పణ్యాలకు దూరంగా తన బతుకేదో తాను బతకాలని చూస్తుంటాడు.

ప్ర‌థ‌మార్ధంలో కిడ్నాప్ డ్రామా ఎపిసోడ్ ఆక‌ట్టుకుంటుంది. విరామ స‌న్నివేశాలు మెప్పిస్తాయి. ద్వితీయార్ధంలో ర‌వినాయ‌క్‌గా బాబీ సింహా ఎంట్రీ ఇచ్చాకైనా క‌థ‌లో సీరియ‌స్‌నెస్ క‌నిపిస్తుందేమో అనుకుంటే, ఆ పాత్ర‌ని కూడా డ‌మ్మీగా మార్చేశారు. సందీప్ కిషన్ మరియు బాబీ సింహా మధ్య ఘర్షణ ఎపిసోడ్‌లు సమర్థవంతమైన రీతిలో అమలు చేయబడలేదు, ఇది సినిమాకు మైనస్ కూడా.

Gully Rowdy Telugu movie Review and rating
Gully Rowdy Telugu movie Review and rating

మొత్తంగా, గల్లీ రౌడీ ఒక ఫార్ములా ఎంటర్‌టైనర్, ఇది ఆనందించే సరదా క్షణాలను కలిగి ఉంటుంది, కానీ పాత్రలలో లోతు లేకపోవడం మరియు సెకండ్ హాఫ్ ప్రొసీడింగ్స్‌లో అసమాన స్క్రీన్ ప్లే లేకపోవడం వల్ల సర్వత్రా ప్రశంసలు లభించకపోవచ్చు. కథనంలో లొసుగులను పక్కన పెడితే, మీరు సరదాగా వినోదభరితంగా ఉంటే, ఈ వారాంతంలో గల్లీ రౌడీ సులభమైన వన్-టైమ్ వాచ్‌గా ముగుస్తుంది.

 

REVIEW OVERVIEW
CB Desk
Previous articleReview: Gully Rowdy- Formulaic entertainer
Next articleఎన్టీఆర్, శివ #NTR30 సినిమాపై లేటెస్ట్ క్రేజీ అప్డేట్..!