Ooru Peru Bhairavakona Teaser: సందీప్ కిషన్ (Sandeep Kishan) కొన్ని సంవత్సరాలుగా సినీ కెరియర్లో ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. సరైన హిట్ దొరకక విడుదల చేసిన ప్రతి ఒక్క సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ కావడంతో చాలా టైం తీసుకుని ఈసారి సస్పెన్స్ థ్రిల్లర్ ఊరు పేరు భైరవకోన అనే సినిమాతో మన ముందుకు వస్తున్నారు. ఊరు పేరు భైరవకోన (Ooru Peru Bhairavakona) సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులోని కొన్ని ప్రాంతాల్లో జరుగుతుంది. ఈరోజు సందీప్ కిషన్ బర్త్ డే సందర్భంగా ఊరు పేరు భైరవకోన టీజర్ ని మేకర్స్ విడుదల చేయడం జరిగింది.
Ooru Peru Bhairavakona Teaser: హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర సగర్వంగా సమర్పిస్తున్నారు. ఊరు పేరు భైరవకోన టీజర్ టీజర్ ఎలా ఉంది అంటే, శ్రీకృష్ణదేవరాయలు కాలంలో ఉన్న గరుడ పురాణంలోని నాలుగు పేజీలు కనిపించకుండా పోయాయని వివరించే శక్తివంతమైన వాయిస్ ఓవర్‌తో టీజర్ ప్రారంభమవుతుంది. టీజర్‌లో ఈ ఊరిలోకి రావడమే కానీ, బయటకు పోవడం ఉండదంటూ వచ్చిన డైలాగ్ విపరీతమైన క్యూరియాసిటీ పెంచుతోంది. దర్శకుడు టీజర్ లోనే సినిమా కథ దేనితో ప్రారంభం అవుతుందో చెప్పేశారు.
దర్శకుడు విఐ ఆనంద్ చాలాకాలం తర్వాత ఈ సస్పెన్స్ థ్రిల్లర్ తో అందర్నీ అలరించడానికి ముందుకు వస్తున్నారు. టీజర్ విజువల్ పరంగా గ్రాండ్ గా సినిమాని తర్కెక్కిస్తున్నట్టు అర్థమవుతుంది. శేఖర్ చంద్ర అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకే హైలెట్ అవుతుందని టీజర్ చూస్తే తెలుస్తుంది. ఈ సినిమాలో సందీప్ కిషన్ కి జోడిగా కావ్యా థాపర్, వర్ష బొల్లమ్మ నటిస్తున్నారు.
ఊరు పేరు భైరవకోన (Ooru Peru Bhairavakona) సినిమాతో అయినా సందీప్ కిషన్ (Sandeep Kishan) కెరియర్ గాడిదపడుతుందని మూవీ లవర్స్ అలాగే అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. సందీప్ కూడా ఈ సినిమా పైనే ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే విడుదలైన మొదటి సాంగు అలాగే ఈ టీజర్ తో సినిమాపై మంచిగా ఏర్పడింది.. మరి ఈ సినిమాతో అయినా సందీప్ కిషన్ కి హిట్టు వస్తుందా లేదంటే ఫ్లాప్ ల జాబితాలో పడిపోతుందా అన్నది వేచిచూడాల్సిందే.
Web Title: Sandeep Kishan next Ooru Peru Bhairavakona teaser out now