Sandeep Madhav George Reddy Trailer Review
Sandeep Madhav George Reddy Trailer Review

ధైర్యానికి, సాహసానికి ప్రతీకగా నిలిచిన పేరు జార్జి రెడ్డి. సమసమాజ స్థాపనే ధ్యేయంగా సాగిన జార్జిరెడ్డి ప్రస్థానం నేటికీ ఎన్నో విద్యార్థి ఉద్యమాలకు ఆదర్శంగా నిలుస్తోంది. హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్శిటీలో చదువుతూ.. విద్యార్థి ఉద్యమాల్లో తిరుగులేని నాయకుడుగా ఎదిగాడు జార్జిరెడ్డి. అలాంటి ఆదర్శనీయమైన విద్యార్థి నేత బయోపిక్ రాబోతున్న సంగతి తెలిసిందే. జీవన్ రెడ్డి దర్శకత్వంలో రానున్న ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ ట్రైలర్ లో జార్జ్ రెడ్డి సినిమా బయోపిక్ అయినా కమర్షియల్ ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి. ఒక కమర్షియల్ హీరో తెరమీర చేసే సాహసాలన్నీజార్జ్ నిజజీవితంలో చేసినట్టు ఈ ట్రైలర్ ను చూస్తే అర్థమవతుంది. చరిత్ర మరిచిపోయిన లీడర్ అనే విషయాన్ని ట్రైలర్ లో బాగా హైలెట్ చేశారు. ట్రైలర్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. ప్రసుతం ట్రెండింగ్ లో ఉంది.

ఇక గతంలో ‘దళం’ సినిమాతో విబిన్నమైన దర్శకుడిగా పేరుతెచ్చుకున్న జీవన్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి. 1960, 70 లలో రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితులను ట్రైలర్ లో బాగా చూపించారు. మైక్ మూవీస్ బ్యానర్ తో కలిసి త్రీ లైన్స్, ”సిల్లీ మాంక్స్ స్టూడియో” సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ”వంగవీటి”ఫేం సందీప్ మాధవ్ (సాండి) ఈ సినిమాలో లీడ్ రోల్ పోషిస్తుండగా, సత్య దేవ్ కూడా ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్నారు. సాంకేతికవర్గానికి విషయానికి వస్తే. సంచలనాత్మక మరాఠి సినిమా ”సైరాత్” ఫొటోగ్రఫీని, ఇటీవల మరాఠి బ్లాక్ బస్టర్ ”నాల్” కు దర్శకత్వం వహించిన సుధాకర్ యెక్కంటి ఈ సినిమాకు ఫొటోగ్రఫిని అందించారు.