sanjana galrani hulchul in general hospital over drug test

Sanjana Galrani Drug Case: సినీనటి సంజనా గల్రానీ హాస్పిటల్‌లో రచ్చ చేసింది. డోప్ టెస్ట్ కోసం ఆమెను తీసుకెళ్లగా తనను బకరానికి చేసి అన్యాయంగా అరెస్ట్ చేశారంటూ కేకలు పెట్టింది. డ్రగ్స్ మాఫియా కేసు విచారణ చేస్తున్న క్రైమ్ బ్రాంచ్ పోలీసులు స్యాండిల్ వుడ్ బ్యూటీలు రాగిణి ద్వివేది, సంజనాలకు రక్త పరీక్షలు చేసి వారి అసలు బండారం బయటకు తియ్యడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ కేసులో పోలీసులు హీరోయిన్లు రాగిణి ద్వివేది, సంజనా గల్రానీకి అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే అనేక మంది బడాబాబుల పేర్లను వీరిద్దరు బయటపెట్టినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే సంజనాకు డ్రగ్ టెస్ట్ చేసేందుకు పోలీసుల ఆమెను బెంగళూరులోని కేసీ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్లు ఆమె బ్లడ్ శాంపిల్స్ సేకరిస్తుండగా సంజనా హల్‌చల్ చేసింది. డాక్టర్లకు సహకరించకుండా పోలీసులతో వాగ్వాదానికి దిగింది. ‘ఈ కేసులో నన్నెందుకు అరెస్ట్ చేశారు. అందరూ కలిసి నన్ను బకరాని చేశారు. ఎలాంటి తప్పు చేయని నన్ను ఎందుకు అరెస్ట్ చేశారో తెలియడం లేదు’ అంటూ కేకలు వేసింది. ఇదే కేసులో రాహుల్, వీరేన్ ఖన్నా, ప్రభుత్వ ఉద్యోగి రవిశంకర్ తదితరులు అరెస్టు అయ్యారు.

sanjana galrani drug case and latest updates