ఉస్తాద్ రామ్ పోతినేని, సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ల క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘డబుల్ ఇస్మార్ట్’. కొన్ని రోజుల క్రితం ఈ సినిమాకు సంబంధించిన షూటింగు ముంబైలో ప్రారంభించారు. అయితే కొన్ని రోజులుగా బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఈ సినిమాలో కీలకమైన పాత్ర పోషిస్తున్నారంటూ ప్రచారం అయితే జరిగింది. ఈరోజు సంజయ్ దత్ పుట్టినరోజు సందర్భంగా డబుల్ ఇస్మార్ట్ సినిమా నుండి మేకర్స్ సంజయ్ దత్ ఫస్ట్ లుక్ పోస్టర్ నీ విడుదల చేయటం జరిగింది.
బాలీవుడ్ స్టార్ సంజయ్‌దత్ డబుల్ ఇస్మార్ట్‌లో ఫుల్ లెంగ్త్ రోల్ పోషిస్తున్నారు. ఆయన మొదటి షెడ్యూల్ షూట్‌లో జాయిన్ అయ్యారు. ఈరోజు, సంజయ్ దత్ పాత్రను బిగ్ బుల్‌గా పరిచయం చేస్తూ మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ఫంకీ హెయిర్‌డో, గడ్డం, చెవిపోగులు, ఉంగరాలు, ఖరీదైన గడియారం, ముఖం, వేళ్లపై పచ్చబొట్టుతో అల్ట్రా స్టైలిష్‌గా కనిపిస్తున్నారు సంజయ్ దత్.
సంజయ్ దత్ పవర్ ఫుల్ క్యారెక్టర్ లో నటిస్తున్నట్లు పోస్టర్ ద్వారా తెలుస్తోంది. తన నటీనటులను బెస్ట్ మాస్ అప్పీలింగ్ లో ప్రజంట్ చేయడంతో దిట్ట అయిన పూరి జగన్నాథ్ ‘డబుల్ ఇస్మార్ట్’ లో సంజయ్ దత్‌ను మునుపెన్నడూ చూడని అవతార్‌లో చూపించనున్నారు. ఈ వైల్డ్ కాంబినేషన్ సినిమాపై అంచనాలను పెంచేసింది.

డబుల్ ఇస్మార్ట్’ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కోసం హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ జియాని జియానెల్లి పనిచేస్తున్నారు. డబుల్ ఇస్మార్ట్ సాంకేతికంగా ఉన్నత ప్రమాణాలతో హై బడ్జెట్‌తో రూపొందుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో తెలియజేస్తారు మేకర్స్. డబుల్ ఇస్మార్ట్ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో మార్చి 8, 2024న మహా శివరాత్రికి విడుదలౌతుంది.