Prabhas – Maruthi Movie Story: కృష్ణంరాజు నటవారుసుడిగా సినీ రంగ ప్రవేశం చేసినప్పటికీ.. అతి తక్కువ కాలంలో తనకంటూ మంచి ఫ్యాన్ బేస్ ఏర్పరచుకున్న యాక్టర్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas). బాహుబలి చిత్రం తర్వాత ప్రభాస్ కేవలం పాన్ ఇండియన్ స్టార్ గానే కాకుండా.. వరల్డ్ వైడ్ మంచి ఫేమ్ తెచ్చుకున్నారు. కానీ ఆ తర్వాత అతను నటించిన రెండు చిత్రాలు ఊహించిన సక్సెస్ను అందించలేకపోయాయి. భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ సాలార్ మరియు రాధే శ్యామ్ ప్రభాస్ ఫ్యాన్స్ ను నిరాశపరిచాయి.
ఈ నేపథ్యంలో రాబోతున్న ప్రభాస్ చిత్రాలపై అంచనాలు విపరీతంగా పెరిగాయి. ఇటు గత కొద్ది రోజులుగా షూటింగ్లో బిజీగా ఉన్న ప్రభాస్ వరుస ప్రాజెక్ట్స్ తో రిలీజ్ కి సిద్ధంగా ఉన్నారు. ప్రశాంత్ నీల్‌తో ‘సలార్’, ఓం రౌత్ నిర్మిస్తున్న ‘ఆదిపురుష్’ (Adipurush), నాగ్ అశ్విన్ ప్రెస్టీజియస్ ప్రాజెక్టు కె…అలాగే..సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ మరియు సిద్ధార్థ్ ఆనంద్ కాంబో లో ఒక భారీ యాక్షన్ మూవీ..ఇలా ప్రభాస్ మంచి మూవీ లైన్అప్ తో బిజీగా ఉన్నాడు.
వీటన్నిటితో పాటుగా మారుతి (Maruthi) డైరెక్షన్లో ప్రభాస్ (Prabhas) హారర్ కామెడీ మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి రాజా డీలక్స్ అనే పేరు పరిశీలనలో ఉంది. అయితే ఈ మూవీ నుంచి ఎటువంటి లీక్స్ లేకుండా మారుతి (Director Maruthi) ఎంతో జాగ్రత్త తీసుకున్నప్పటికీ చిత్రం యొక్క కాన్సర్ హారర్ కామెడీ అన్న విషయం లీక్ అయిపోయింది. ఓ రకంగా ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాల దగ్గర నుంచి షూటింగ్ వరకు ఎంతో గోపికంగా జరిగింది. ఈ షూటింగ్ కోసం ప్రత్యేకంగా నిర్మించి అందులో చిత్రీకరణను చేస్తున్నారు. దాదాపు 60 శాతం పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నుంచి తాజాగా మరొక క్రేజీ న్యూస్ లీక్ అయింది.
మంచి హారర్ థ్రిల్లర్గా రాబోతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ (Sanjay Dutt) దెయ్యం పాత్ర లో నటిస్తున్నారు అని చాలా రోజుల నుంచి గాసిప్ నడుస్తుంది. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం ఇందులో సంజయ్ దత్ చేస్తున్న సీన్స్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ కలిగించే విధంగా ఉన్నాయట.
ముఖ్యంగా సంజయ్ దత్ (Sanjay Dutt) నటించిన హారర్ సీన్స్…వెనుక వచ్చే బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ ప్రేక్షకులను భయపెట్టే విధంగా ఉన్నాయి అని తెలుస్తుంది. ఆ సీన్స్ వచ్చేటప్పుడు ప్రేక్షకులు సీట్లో కూర్చోవడం కూడా కష్టం అన్న టాక్ వినిపిస్తోంది. ఈ మూవీ లో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రం మొత్తానికి టాలీవుడ్ ఇండస్ట్రీకి సరికొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అని అందరూ ఆశిస్తున్నాను.
Web Title: Sanjay dutt ghost character in Prabhas maruthi movie, Prabhas Maruthi movie shooting update, Sanjay Dutt to play Ghost Role in Raja Deluxe.