ఇవే సంక్రాంతి కి థియేటర్స్ లో రానున్న తెలుగు సినిమాలు

0
354
Sankranthi 2021: List Of Films Lined Up For A Release From Tollywood

2020 సంక్రాంతికి సూప‌ర్‌స్టార్ మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘అల..వైకుంఠపురములో’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో సందడి చేశాయో తెలిసిందే.. ఆ తర్వాత లాక్‌డౌన్ కారణంగా థియేటర్లు మూతపడ్డాయి.. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలమేరకు ఇప్పుడిప్పుడే కొన్ని మల్టీప్లెక్సులు తెరుచుకున్నాయి.. కానీ సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఓపెన్ కాలేదు.. మరికొద్ది రోజుల్లో అవి కూడా పున:ప్రారంభం కానున్నాయి..

ఇప్పటివరకు పాత సినిమాలే స్క్రీనింగ్ అవుతుండగా క్రిస్మస్ కానుకగా సుప్రీం హీరో సాయి తేజ్ ‘సోలో బ్రతుకే సో బెటర్’ రిలీజ్ కానుంది. ఇప్పటికైతే మల్టీప్లెక్సుల్లో బుకింగ్స్ ఓపెన్ చేశారు. సింగిల్ థియేటర్ల విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. అయితే మన తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి నుండి కొత్త సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.. ఈ మేరకు నిర్మాతలు డేట్స్ లాక్ చేసేసుకున్నారు..

తమిళ్ స్టార్, దళపతి విజయ్ నటించిన ‘మాస్టర్’ జనవరి 13న రిలీజ్ కానుంది. 14 మాస్ మహారాజా రవితేజ ‘క్రాక్’, రానా దగ్గుబాటి బైలింగ్వుల్ మూవీ ‘అరణ్య’ ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.. జనవరి 15న ఎనర్జిటిక్ స్టార్ రామ్ ‘రెడ్’ సినిమా విడుదల కానుంది. కొత్త సినిమాలతో బాక్సాఫీస్ బరిలో మళ్లీ సంక్రాంతి సందడి నెలకొనబోతోంది..