Sankranti 2023 movies list: కోవిడ్ కారణంగా మూడు సంవత్సరాలు సంక్రాంతికి విడుదలయ్యే సినిమాల మజా చాలా తగ్గిపోయింది. అయితే ఈసారి సంక్రాంతి 2023కి చాలా సినిమాలు పోటీ లోకి వచ్చాయి. కానీ వీటికి సంబంధించి ప్రొడ్యూసర్ బృందం ఒక నిర్ణయం తీసుకోవటం తో కొన్ని సినిమాలకి సంక్రాంతి పరిమితమైంది.
Sankranti 2023 movies Release Dates: సంక్రాంతి 2023 కి విడుదల కాబోయే సినిమాల మధ్య చాలా పెద్ద పోటీనే ఉంది. తెలుగు అలాగే తమిళం నుంచి పెద్ద హీరోలు ఈ సంక్రాంతికి పోటీ పడుతున్నారు. వారిదో మెగాస్టార్ చిరంజీవి, నటసింహ బాలకృష్ణ, దళపతి విజయ్, అలాగే తమిళ్ స్టార్ విజయ్ కూడా ఈ పోటీలో ఉన్నారు.
ఈ సినిమాలన్నీ పొంగల్ కీ విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ డేట్స్ మాత్రం చెప్పలేదు ప్రొడ్యూసర్. వీటిలో ముఖ్యంగా బాబీ దర్శకత్వంలో వస్తున్న చిరంజీవి మూవీ వాల్తేరు వీరయ్య. మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. శృతిహాసన్ హీరోయిన్ గా చేస్తున్న వాల్తేరు వీరయ్య ఈ సినిమాలో రవితేజ కీలకమైన పాత్రలో నటిస్తున్నారు.
రవితేజకు జోడీగా ఈ మూవీలో కేథరిన్ నటిస్తోంది. వాల్తేరు వీరయ్య సంక్రాంతి బరిలో దిగుతున్న అని చెప్పిన మేకర్స్ డేట్ అయితే ప్రకటించలేదు. కాగా ఈ మూవీని జనవరి 11న విడుదల చేయబోతున్నారని తెలుస్తోంది. ఇక్కడ విశేషమేమిటంటే ఇదే బ్యానర్ నుంచి నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి తో బరిలో దిగుతున్నాడు.
ఒకే బ్యానర్ నుండి రెండు సినిమాలు సంక్రాంతి బరిలో ఉండటం ఇదే మొదటిసారి. దీంతో మైత్రి మూవీ మేకర్స్ వారు కూడా థియేటర్ల విషయంలో అలాగే రిలీజ్ డేట్ విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అఖండ భారీ విజయం తరువాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీరసింహారెడ్డి సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఒకే బ్యానర్ రెండు సినిమాలు అన్నట్టు ఈ రెండు సినిమాల్లోనూ శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.
అయితే ఈ మూవీ రిలీజ్ డేట్ ని మాత్రం ఇంత వరకు చిత్ర బృందం ప్రకటించలేదు. వీటితో పాటు ప్రభాస్ ఆది పురుష్ సినిమాను కూడా విడుదల చేయుటకు సిద్ధం చేశారు. కానీ ఈ సినిమా ప్రొడ్యూసర్ లు సాంకేతిక విలువలు పెంచటం కోసమని విడుదల తేదీ ని మార్చడం జరిగింది.
ఇక మన తెలుగు సినిమాలతో పాటు తమిళ తంబీలు కూడా సంక్రాంతి బరిలో దిగుతున్న గారు. వీటిలో దళపతి విజయ్ నటిస్తున్నా వారసుడు సినిమాని సంక్రాంతి బరిలో దించారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం ఇస్తున్న ఈ సినిమాని దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. అయితే ఈ మూవీని జనవరి 12న విడుదల చేయాలని దిల్ రాజు ప్లాన్ చేసుకున్నారట.
వారసుడు సంబంధించి దిల్ రాజు ఇప్పటికే తెలంగాణ మరియు ఆంధ్రాలో లో థియేటర్ లో బుక్ చేసినట్టు సమాచారం. ఇక చివరిగా తమిళ హీరో అజిత్ నటిస్తున్న ‘తునీవు’ కూడా రాబోతోంది. హెచ్ వినోద్ డైరెక్షన్ లో బోనీ కపూర్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. అయితే రిలీజ్ డేట్ ని ఇప్పటి వరకు ప్రకటించకపోవడం గమనార్హం. ఈ సినిమాపై కూడా అంచనాలు భారీగానే వున్నాయి. మరి ఈ సంక్రాంతి 2023కి ఏ సినిమా పోటీ పడుతుందో మరికొన్ని రోజులు గడిస్తే కానీ తెలియదు.