
ఈ సంవత్సరం సంక్రాంతికి థియేటర్స్ సర్దుబాటు విషయంలో ఎంత రచ్చ జరిగిందో అందరికి తెలిసిందే.సంక్రాంతికి NTR కథానాయకుడు,F2 ,వినయ విధేయ రామ సినిమాలతో పాటు తమిళ్ సిమిమా పేట కూడా రిలీజ్ అయ్యింది.కానీ ఆ సినిమాకి థియేటర్స్ దొరకలేదు.దాంతో థియేటర్ మాఫియా అంటూ గొడవలు జరిగాయి.
2020 సంక్రాంతికి కూడా ఏకంగా 5 తెలుగు సినిమాలు రిలీజ్ అవుతాయనే కాలిక్యులేషన్ అందరిని కలవరపరిచింది.మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు,బన్నీ-త్రివిక్రమ్ ల అలకనంద,బాలయ్య సినిమా,నాగ్ బంగార్రాజు లతో పాటు మురుగ దాస్-రజిని ల దర్బార్ కూడా రేస్ లో ఉంది.మూడు తెలుగు సినిమాలకే రిలీజ్ డేట్స్ పరంగా క్లాష్ వస్తే ఇప్పుడు నాలుగు సినిమాలు,మధ్యలో ఒక డబ్బింగ్ సినిమా….మరి థియేటర్స్ విషయంలో మళ్ళీ అలజడి తప్ప్పుడు అనుకున్నారు అంతా.కానీ ఇప్పుడు మాత్రం తగ్గితే తప్పేముంది అనుకున్న నాగార్జున,కొత్త సినిమాకు కొబ్బరికాయ కొట్టిన బాలయ్య సంక్రాతి రేస్ లో లేరు అనే టాక్ వినిపిస్తుంది.బాలయ్య-KS రవికుమార్ ల కాంబినేషన్ లో కొత్త సినిమా స్టార్ట్ అయ్యింది.ఆ సినిమా 2020 సంక్రాంతికి వస్తుంది అనుకున్నారు.
కానీ ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం చూస్తే నవంబర్ లో రిలీజ్ కి వెళ్లడం ఖాయం అంటున్నారు.సంక్రాంతి టైం కి బోయపాటి సినిమా మొదలుపెట్టాలి అనేది బాలయ్య ఆలోచన అని తెలుస్తుంది.నాగార్జున కూడా ఆగష్టు 9 న మన్మధుడు-2 రిలీజ్ కాగానే బంగార్రాజు సీక్వెల్ ని సెట్స్ మీదకి తీసుకువెళ్లాలి అనుకున్నాడు.కానీ సంక్రాంతి కి ఉన్న పోటీ చూసి ఆలోచనలో పడ్డాడు.పైగా నాగ చైతన్య కూడా వెంకీమామ తరువాత శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు.అందుకే బంగార్రాజు కూడా పోస్ట్ పోన్ అవ్వడం ఖాయం అయిపొయింది.అంటే 2020 సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు,అలకనంద స్ట్రెయిట్ మూవీస్ గా రిలీజ్ అవుతున్నాయి.శర్వానంద్,నాగ శౌర్య లాంటి హీరోలు వచ్చినా ఇబ్బంది ఉండదు.దర్బార్ ఒక్కటే పెద్ద డబ్బింగ్ సినిమా.సో,ముచ్చటగా మూడు సినిమాలే కాబట్టి మూడు రోజుల పండగ ఏ డిస్ట్రబెన్స్ లేకుండా జరుగుతుంది.