Sai Pallavi: నాలుగు నెలల్లోనే ఏకంగా 25 కోట్లు

0
34
Saranga Dariya Song Hits 250 Million Views In Short Time

Saranga Dariya​: నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘లవ్‌స్టోరీ’ సినిమాలోని ఈ పాట ఇప్పటికే పలు రికార్డులు తిరగరాసిన సంగతి తెలిసిందే. సాయి పల్లవి నాచురల్ అందానికి తోడు ఆమె డాన్స్ పర్‌ఫార్‌మెన్స్ ఈ పాటకు మేజర్ అట్రాక్షన్ అయి సెన్సేషన్ క్రియేట్ చేసింది.

ఇక శేఖర్ మాస్టర్ స్టెప్పులను సాయి పల్లవి తనదైన స్టైల్‌లో చేసి చేసింది. దీంతో రికార్డుల సునామీ సృష్టిస్తున్న ఈ సాంగ్ తాజాగా మరో అరుదైన ఫీట్ సాధించింది. అతి తక్కువ కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్‌ రాబట్టడమే గాక.. మొదటి నాలుగు నెలల్లోనే 25 కోట్ల వ్యూస్‌తో సోషల్ మీడియా దుమ్ముదులుపుతోంది.

శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు కె నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్రావు నిర్మాతలు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా కరోనా కారణంగా థియేటర్స్ మూతపడటంతో వాయిదా పడింది. చిత్ర విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది ప్రేక్షక లోకం.