Sarath Babu Health Update: శరత్ బాబు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో కొన్ని రోజులుగా తను ఆసుపత్రిలో ఉండటం జరిగింది. అయితే ఇప్పుడు శరత్ బాబు చనిపోయారంటూ కొన్ని గంటలకు వార్తలు సోషల్ మీడియాలోనూ అలాగే వెబ్ మీడియాలోనూ ప్రచారాలు జరుగుతున్నాయి. దీనిపై శరత్ బాబు సోదరి సోషల్ మీడియా ద్వారా స్పందించడం జరిగింది.
Sarath Babu Health Update: శరత్ బాబు గారి ఆరోగ్యం పరిస్థితి బాలేదన్న విషయం నిజమే కానీ.. ఆయన బతికే ఉన్నారు.. ఆయన ఆరోగ్యం ఇప్పుడు కుదిటి పడటంతో ICU నుంచి నార్మల్ రూమ్ కి డిస్చార్జ్ చేయడం కూడా జరిగింది..సోషల్ మీడియా లో శరత్ బాబు గారి గురించి వచ్చే వార్తలు అన్ని తప్పుగా వస్తున్నాయి..తొందరలోనే శరత్ బాబు గారు పూర్తిగా కోలుకొని మీడియాతో మాట్లాడుతారు అని ఆశిస్తున్నాను….సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు ఏవి నమ్మవద్దు అని నా విజ్ఞప్తి.. అని ప్రెస్ నోట్ విడుదల చేయడం జరిగింది.
ఏఐజీ హాస్పిటల్‌లో చేరిన శరత్ బాబుకి డాక్టర్లు వెంటిలేటర్స్ వైద్యం చేయడం జరిగింది. అయితే ఈరోజు సాయంత్రం శరత్ బాబు గారు చనిపోయారంటూ సోషల్ మీడియాలో వార్తల రాగానే.. చాలామంది సంతాపం వ్యక్తం చేస్తూ పోస్టులు పెట్టారు. దీంతో చాలా వెబ్సైట్లు అలాగే యూట్యూబ్ ఛానల్స్ తను చనిపోయారంటూ వార్తలు కూడా రాసేసాయి.
ఇప్పుడు తన సోదరి ప్రెస్ నోట్ విడుదల చేయడం జరిగింది అలాగే సొంత ఊరులో ఉన్న శరత్ బాబు సోదరుడు కూడా ఆయన చనిపోలేదు అంటూ మీడియా ముందుకు వచ్చి చెప్పడం జరిగింది.