Saripodhaa Sanivaaram movie shooting update, Nani next movie, Nani and Priyanka Mohan next movie Saripodhaa Sanivaaram, Saripodhaa Sanivaaram shooting location, working stills
నేచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో రెండో సినిమాగా వస్తున్న ‘సరిపోదా శనివారం’ గత నెలలో గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. నానిని యాక్షన్ అవతార్‌లో ప్రజెంట్ చేసిన యూనిక్ అడ్రినలిన్ రష్ తో కూడిన అన్‌చైన్డ్ వీడియోకి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి భారీ బడ్జెట్‌తో హ్యుజ్ కాన్వాస్‌తో ఈ ప్రాజెక్ట్‌ని నిర్మిస్తున్నారు.
ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈరోజు హైదరాబాద్‌లో యాక్షన్ ఎపిసోడ్‌తో ప్రారంభమైంది. రామ్-లక్ష్మణ్ మాస్టర్లు ఈ హైవోల్టేజ్ ఎపిసోడ్‌ను పర్యవేక్షిస్తున్నారు. ఈ షెడ్యూల్‌లో యాక్షన్‌తో పాటు కొన్ని టాకీ పార్ట్‌లను కూడా చిత్రీకరించనున్నారు. నానితో పాటు సినిమాలోని ప్రధాన ఆర్టిస్టులు షూటింగ్‌లో భాగం కానున్నారు.
నాని రగ్గడ్ లుక్‌లో కనిపించనున్న ఈ చిత్రంలో ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా నటిస్తున్నారు. తమిళ స్టార్ నటుడు ఎస్‌జే సూర్య కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. సెన్సేషనల్ కంపోజర్ జేక్స్ బిజోయ్ సంగీతం అందించగా, మురళి జి సినిమాటోగ్రాఫర్. కార్తీక శ్రీనివాస్ ఎడిటర్. పాన్ ఇండియా మూవీ ‘సరిపోదా శనివారం’ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.