పోలీసులను ఆశ్రయించిన మహేష్, బన్ని నిర్మాతలు

0
1892

Sarkaru Vaari Paata – Pushpa : సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన మహేష్ బాబు, అల్లు అర్జున్ నిర్మాతలు. అల్లు అర్జున్‌, మహేష్ బాబు లకు చెందిన చిత్రాల కంటెట్‌ ఆన్‌లైన్‌లో లీక్‌ కావడం కలకలం రేపుతోంది. మహేష్ బాబుతో ‘సర్కారు వారి పాట’, అల్లు అర్జున్ తో ‘పుష్ప’ చిత్రాలను ఏకకాలంలో నిర్మిస్తోంది మైత్రీ మూవీ మేకర్స్.

ఈ నెల 9న మహేష్ బాబు (Mahesh Babu) బర్త్ డే సందర్భంగా ‘సర్కారు వారి పాట’(Sarkaru Vaari Paata) టీజర్‌‌ను ఉదయం 9 గంటల సమయంలో విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. తీరా చెప్పిన సమయం కంటే ముందుగానే ‘సర్కారు వారి పాట’ టీజర్ లీక్ కావడంతో నిర్మాతలు అర్ధరాత్రి హడావుడిగా ‘సర్కారు వారి పాట’ టీజర్‌ను విడుదల చేయాల్సి వచ్చింది.

Allu Arjun Dakka Dakka Mukka song record views

‘పుష్ప’ (Pushpa) నుండి ‘దాక్కో దాక్కో మేక’ (Daakko Daakko Meka) తెలుగు వెర్షన్ షెడ్యూల్ విడుదల తేదీకి ముందే సోషల్ మీడియాలో లీక్ అయింది. మేకర్స్ దీనిపై అధికారిక ప్రకటన విడుదల చేశారు. లీకులు తమను కలవర పెట్టాయని చెప్పారు. అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో ‘పుష్ప’ (Pushpa) సినిమాను కూడా మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) నిర్మిస్తోంది.

Mahesh Babu’s Sarkaru Vaari Paata Goa Schedule Begins

సినిమాకు సంబంధించిన టీజర్, పాటలు లీక్ కావడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. సదరు సినిమాల టీజర్, పాటలను లీక్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. త్వరలోనే నిందితులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాము. దయచేసి పైరసీని ప్రోత్సహించవద్దు’ అంటూ ట్వీట్ చేశారు.

Sarkaru Vaari Paata and Pushpa makers lodge a complaint with Cyber Crime after first teaser and song LEAK

సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కతున్న మొదటి భాగం ‘పుష్ప : ది రైజ్’ ఈ క్రిస్మస్ కానుకగా థియేటర్లలోకి రానుంది. ఇక మహేష్ బాబు హీరోగా నటిస్తోన్న ’సర్కారు వారి పాట’ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ 14 రీల్స్ తో పాటు మహేష్ బాబు ప్రొడక్షన్‌తో కలిసి సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు..ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.

 

Previous articleనాని టక్ జగదీష్ అమెజాన్ ప్రైమ్ వీడియో లో విడుదల..?
Next articleMalavika Mohanan Hot Collections