సర్కారు వారి పాట రివ్యూ – పాటలో రిథమ్ మిస్ !

రేటింగ్ : 2.5 / 5
నటీనటులు : మహేష్ బాబు, కీర్తి సురేష్, సముద్రఖని, నదియా, వెన్నెల కిషోర్, సుబ్బరాజు తదితరులు.
దర్శకత్వం: పరశురాం పెట్ల
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట మరియు గోపి ఆచంట
సంగీతం: థమన్ ఎస్
సినిమాటోగ్రఫీ: ఆర్ మధి
ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్

మహేష్ బాబు హీరోగా వచ్చిన ఈ సర్కారు వారి పాట పై మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. పైగా పరుశురామ్ ఫామ్ లో ఉండటం ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ అయ్యింది. మరీ ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ చూద్దాం.

కథ :
మహేష్ (మహేష్ బాబు) తలిదండ్రులు (నాగబాబు – పవిత్ర లోకేష్) బ్యాంక్ నుంచి తీసుకున్న లోన్ ను కట్టలేక ఆత్మహత్య చేసుకుని చనిపోతారు. ఏ అప్పు అయితే, తనను ఒంటరి వాడిని చేసిందో.. ఆ అప్పు పై బలమైన అభిప్రాయంతో మహేష్ పెరిగి పెద్దవుతాడు.

యూఎస్‌ కి వెళ్లి లోన్ రికవరీ బిజినెస్ స్టార్ట్ చేసి.. సక్సెస్ ఫుల్ గా బిజినెస్ మెన్ గా మారతాడు. కానీ, అలాంటి మహేష్ ను కళావతి (కీర్తి సురేష్) డబ్బుల కోసం మోసం చేస్తోంది. అప్పు తీసుకుని తిరిగి చెల్లించకుండా మహేష్ ఇగోను హర్ట్ చేస్తోంది. అంతలో అనుకోకుండా జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం కళావతి తండ్రి రాజేంద్రనాథ్ (సముద్రఖని)ను మహేష్ టార్గెట్ చేస్తాడు.

SVP Movie Review
SVP Movie Review

రాజేంద్రనాథ్ తనకు పదివేల కోట్లు అప్పు ఉన్నాడని మహేష్ మెలిక పెడతాడు. మహేష్ బాబు ఇదంతా దేని కోసం చేశాడు ? అసలు మహేష్ కి నదియాకి ఉన్న సంబంధం ఏమిటి ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.

విశ్లేషణ :
సినిమాలో హైలైట్స్ విషయానికి వస్తే.. మహేష్ బాబే ఈ సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్. పవర్ ఫుల్ మహి పాత్రలో మహేష్ తన ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులను కూడా అబ్బురపరిచాడు. ముఖ్యంగా ఎమోషనల్ గా సాగే సన్నివేశంలో మహేష్ నటన సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఆర్థిక అన్యాయాన్ని ఎదిరించే మహిగా మహేష్ తన నట విశ్వ‌రూపాన్ని ప్ర‌ద‌ర్శించాడు. అహంకారానికి పర్యాయపదంలా సముద్రఖని పాత్ర నిలిచింది. ఆ పాత్రలో ఆయన తన నటనతో ఒదిగిపోయారు. సముద్రఖని నటన కూడా తార‌స్థాయిలో ఉంది. మహేష్ – కీర్తి సురేష్ మధ్య ఎమోషన్ కూడా చాలా బాగా పడింది.

Mahesh Sarkaru Vaari Paata Telugu Review
Mahesh Sarkaru Vaari Paata Telugu Review
- Advertisement -

కళావతి పాత్రలో కీర్తి కూడా చాలా బాగా ఆక‌ట్టుకుంది. దర్శకుడు పరుశురాం కంటెంట్ బేస్డ్ స్టోరీలో హీరోయిజమ్ పెట్టిన విధానం, అలాగే మహేష్ ను చూపించే విధానం చాలా బాగున్నాయి. సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే.. థమన్ అందించిన సంగీతం ఆకట్టుకుంది. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది.

ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్ సినిమాలోని సాగతీత సీన్స్ ను తగ్గించి ఉంటే ప్లస్ అయ్యేది. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సర్కారు వారి పాట చిత్రాన్ని భారీగా నిర్మించారు. సినిమాలో కామెడీ కోసం మహేష్ చాలా కష్టపడ్డాడు. దానికి తగ్గట్టు మహేష్ తన మేనరిజమ్స్ ను చాలా బాగా వాడారు.

ఇక నదియా పాత్ర చాలా ఎమోషనల్ గా సాగింది. వెన్నెల కిషోర్ గొప్ప కమెడియన్ అని మరోసారి ఈ సినిమాతో రుజువు చేసుకున్నాడు. అసలు సర్కారు లో కిషోర్ కామెడీ అతి పెద్ద ప్లస్ పాయింట్. అలాగే, ఫస్ట్ హాఫ్ లో మహేష్ ఇంట్రడక్షన్ సీక్వెన్స్, అలాగే ఇంటర్వల్ లో వచ్చే ఫైట్స్ బాగున్నాయి.

SVP Review in Telugu
SVP Review in Telugu

ప్లస్ పాయింట్స్ :
మహేష్ స్క్రీన్ ప్రెజెన్సీ
సముద్రఖని నటన.
దర్శకుడు పరుశురాం రాసిన డైలాగ్స్,
యాక్షన్ సీన్స్.

మైనస్ పాయింట్స్ :
స్లో నేరేషన్
స్లోగా సాగే యాక్షన్ సీన్స్
సినిమాటిక్ వ్యూ ఎక్కువ అయిపోవడం.
స్లో నేరేషన్ తో సాగే లాజిక్ లెస్ సోషల్ డ్రామా,
బోరింగ్ ట్రీట్మెంట్ తో సాగే రొటీన్ డ్రామా,

తీర్పు :
సోషల్ మెసేజ్ లో యాక్షన్, ఎమోషన్స్ మిక్స్ చేసి ఓ పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ ‘సర్కారు వారి పాట’ బాగానే ఆకట్టుకుంది. మహేష్ తన యాక్టింగ్ తో బాగా ఆకట్టుకున్నాడు. అయితే స్లో నేరేషన్, బోరింగ్ ప్లే సినిమాలో ఒకింత నిరాశపరిచే అంశాలు. మొత్తంగా మహేష్ మాత్రం మెప్పించాడు. కానీ అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ సినిమా కనెక్ట్ కాదు.

Related Articles

Telugu Articles

Movie Articles