‘స‌ర్కారు వారి పాట’ షూటింగ్ ‌ఫోటోలు

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేశ్‌బాబు హీరోగా, ప‌ర‌శురాం డైరెక్షన్ లో వస్తున్న సినిమా ‘స‌ర్కారు వారి పాట’. కీర్తిసురేష్ హీరోయిన్ గా న‌టిస్తుండ‌గా.. ఎస్ థ‌మ‌న్ మ్యూజిక్ అందిస్తున్నారు.  ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ దుబాయ్‌లో జ‌రుపుకుంటోంది. దుబాయ్ బ్యాక్ డ్రాప్ లో వ‌చ్చే కీల‌క స‌న్నివేశాలను చిత్రీక‌రిస్తున్నారు.

 

ఆ లొకేషన్ ను మ‌హేశ్‌బాబు తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టాడు. దుబాయ్‌లో ‘స‌ర్కారు వారి పాట’ షూటింగ్‌లో పాల్గొన‌డం అద్బుత‌మైన అనుభ‌వం. మాకు ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికిన కంపెనీకి కృత‌జ్ఞ‌త‌లు అంటూ ఆ పిక్ షేర్ చేశారు మహేష్ బాబు. అయితే తాజాగా మహేష్ కు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాల ఫోటోలు షూటింగ్‌ లొకేషన్‌ నుంచి లీక్ అయ్యాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా, ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రానున్నట్లుగా ఇటీవలే మూవీ మేకర్స్ ప్రకటించారు.

Show comments

Related Articles

Telugu Articles

Movie Articles