విడుదల తేదీ వాయిదా దిశగా సర్కారు వారి పాట..?

0
442
Sarkaru Vaari Paata to be Postponed Again
Sarkaru Vaari Paata to be Postponed Again

మహేష్ బాబు ఉ పరుశురాం దర్శకత్వంలో వస్తున్న సినిమా సర్కారీ వారి పాట. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అయితే అనుకోని కారణాలవల్ల చివరి షెడ్యూల్ వాయిదా వేయడం జరిగింది. సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు ఇటీవల అనారోగ్యంతో మరణించారు, మరియు చిన్న కుమారుడు మహేష్ బాబు COVID-19 బారిన పడ్డారు.

కవిడ్ నుండి కోలుకుంటున్న మహేష్ బాబు త్వరలోనే సర్కారీ వారి పాట షూటింగ్ లో జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కరోన కేసులు పెరుగుతున్న ఈ తరుణంలో ప్రభుత్వం లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే ప్రభుత్వం థియేటర్లకు 50% ఆక్యుపెన్సీ విధించడం జరిగింది. కోవిడ్-19 కేసుల పెరుగుదల కారణంగా, “సర్కారు వారి పాట” షూట్ నిరంతరం ఆలస్యం అవుతుంది.

ఈ సినిమా ఇటీవలే సంక్రాంతి నుంచి ఏప్రిల్ 1కి వాయిదా పడింది. మేకర్స్ మళ్లీ కొత్త విడుదల తేదీని ప్రకటించే విధంగా అడుగులు వేస్తున్నారని సమాచారం అందుతుంది. ఫిబ్రవరిలో జరగాల్సిన షూటింగ్ కూడా జరిగే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే, ఒకవేళ కరుణ కేసులు ఎక్కువ అయితే, ప్రభుత్వం లాక్ డౌన్ విధించి షూటింగ్ జరిగే అవకాశం ఉండదు.

Mahesh Babu Sarkaru Vaari Paata to be Postponed Again
Mahesh Babu Sarkaru Vaari Paata to be Postponed Again

అదే కాకుండా ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కు కూడా కరోన బారిన పడ్డారు. ఇవన్నీ పరిగణనలోకి తీసుకున్న మేకర్స్ సంక్రాంతికి స్టార్ట్ చేద్దాం అనుకున్న మ్యూజిక్ ప్రమోషన్ కూడా ఆపేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం అందుతుంది. దీనిపై మరింత అప్డేట్ సంక్రాంతి గాని తెలియదు.

Previous articleవిరామంలో కొత్త స్క్రిప్ట్ లు వింటున్న ప్రభాస్..!
Next articleబంగార్రాజు ట్రైలర్: అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌