మహేష్ బాబు రాబోయే సినిమా సర్కారు వారి పాట మే 12న విడుదలకు సిద్ధంగా ఉంది. పరశురాం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా చేస్తుంది. ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్ లో జోరుగా జరుగుతున్నాయి. సర్కారు వారి పాట ట్రైలర్ నీ మే 2న విడుదలకు సిద్ధం చేశారు.
కానీ అనుకోని విధంగా సర్కారు వారి పాట ట్రైలర్ సంబంధించి 10 సెకండ్ల వీడియో క్లిప్ ఇంటర్నెట్ లో లీక్ అయింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మహేష్ బాబు ఉ సర్కారీ వారి పాట సినిమాకి మొదటి నుంచి ఈ లీకుల బెడద తప్పలేదు.
సర్కారు వారి పాట ప్రమోషన్లు స్టార్ట్ చేసిన దగ్గర నుండి సినిమాకు సంబంధించిన ప్రతి ఒకటి లీక్ అవుతూనే ఉన్నాయి. ప్రేమికుల రోజు మొదటి పాటని కళావతి విడుదల చేద్దామని చూడగా అది ఒక రోజు ముందుగానే సోషల్ మీడియా లోకి విడుదల అవ్వడం జరిగింది.
దీనికి సంబంధించి మైత్రి మూవీ మేకర్స్ జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పినప్పటికీ, సర్కారీ వారి పాట సినిమాకు సంబంధించి రెండో సాంగ్ కూడా అలాగే లీక్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ఏకంగా ట్రైలర్ పది సెకండ్ల వీడియో క్లిప్ ఇంటర్నెట్లో లీక్ అయింది. సోషల్ మీడియాలో మహేష్ ఫ్యాన్స్ ఈ విషయమై నిర్మాతల పై మండిపడుతున్నారు.
Reach Kosam Madam Eyy Leak chesindhi anta bayata talku😭😭🥺#SVPTrailer pic.twitter.com/m4buTzPAfB
— GANI TEJA🦅 (@GANITEJAPSPK) May 1, 2022