Satyadev Kancharana Announces His Next Movie Titled Thimmarusu

SatyaDev Thimmarusu: విలక్షణమైన కథా చిత్రాలు, పాత్రలతో నటుడిగా ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందుతున్న సత్యదేవ్ (SatyaDev)‌ హీరోగా కొత్త సినిమాను ప్రకటించారు. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో ‘తిమ్మరుసు’ సినిమా చేయబోతున్నట్లు తెలిపాడు.

త్వరలోనే షూటింగ్‌ ప్రారంభంకానున్న ఈ సినిమా టైటిల్‌ లోగోను సోమవారం విడుదల చేశారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందుతోన్న చిత్రమని తెలియజేసేలా రూపొందిన ఈ టైటిల్ లోగో ఆసక్తినిరేపుతోంది. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్ బ్యానర్స్‌పై మహేశ్ ఎస్ కోనేరు, సృజన్ యరబోలు సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నట్లు తెలిపారు.

బ్లఫ్‌ మాస్టర్‌’తో హీరోగా మెప్పించిన సత్యదేవ్‌ రీసెంట్‌గా విడుదలైన విలక్షణ చిత్రం ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ చిత్రంలోనూ వైవిధ్యమైన టైటిల్‌ రోల్‌ను పోషించి ప్రేక్షకులను అలరించారు. నటుడిగా తనకంటూ ఓ ఇమేజ్‌ను క్రియేట్‌ చేసుకుంటూ ముందుకు సాగుతున్న సత్యదేవ్‌తో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు ఆసక్తిని కనపరుస్తున్నారు.