సత్యదేవ్ హీరోగా మే 21న విడుదలకు సిద్ధమవుతోన్న‘తిమ్మరుసు’

0
81
Satyadev priyanka jawalkar Timmarusu movie gets release date

‘బ్ల‌ఫ్ మాస్ట‌ర్‌, ఉమామ‌హేశ్వ‌రాయ ఉగ్ర‌రూప‌స్య’ వంటి చిత్రాల్లో విల‌క్ష‌ణ క‌థానాయ‌కుడిగా మెప్పించిన‌ సత్యదేవ్‌ హీరోగా నటిస్తోన్న చిత్రం ‘తిమ్మరుసు’. ‘అసైన్‌మెంట్‌ వాలి’  ట్యాగ్‌లైన్. ప్రియాంక జ‌వాల్క‌ర్ హీరోయిన్‌.  ఈ చిత్రాన్ని మే 21న విడుద‌ల చేస్తున్నారు.

ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మహేశ్‌ కోనేరు‌ తో పాటు ఎస్‌ ఒరిజినల్స్‌ బ్యానర్‌పై సృజన్‌ ఎరబోలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘‘తిమ్మరుసు’ సినిమా చిత్రీకరణంతా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మే 21న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాం. సత్యదేవ్‌ పవర్ఫుల్ లాయర్‌ పాత్రలో నటిస్తున్నారు. ఆయన లుక్‌, క్యారెక్టర్‌ డిజైనింగ్‌ చాలా కొత్తగా ఉంటుంది. డైరెక్టర్‌ శరణ్‌ కొపిశెట్టి, పక్కా ప్లానింగ్‌తో సినిమాను శరవేగంగా పూర్తి చేశారు. ఈ సినిమా టీజర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. తప్పకుండా సినిమాలో ప్రేక్షకులు కోరుకునే కమర్షియల్ ఎలిమెంట్స్, ఎంటర్‌టైన్మెంట్‌తో పాటు మంచి సందేశం కూడా ఉంటుంది’’ అన్నారు.

నటీనటులు:
సత్యదేవ్‌,  ప్రియాంక జ‌వాల్క‌ర్‌, బ్రహ్మాజీ, అజయ్‌, అల్లరి రవి బాబు, అంకిత్, ప్రవీణ్‌, ఆదర్శ్‌ బాలకృష్ణ, ఝాన్సీ, వైవా హర్ష, సంధ్యా జనక్‌ తదితరులు

సాంకేతిక వర్గం:
దర్శకత్వం: శరణ్‌ కొప్పిశెట్టి
నిర్మాతలు: మహేశ్‌ కోనేరు, సృజన్‌
సంగీతం:  శ్రీచరణ్‌ పాకాల
సినిమాటోగ్రఫీ:  అప్పూ ప్రభాకర్‌
ఆర్ట్‌:  కిరణ్‌ కుమార్‌ మన్నె
యాక్షన్‌: వెంకట్ మాస్టర్,  రియల్‌ సతీశ్‌
పి.ఆర్‌.ఒ:  వంశీకాక
2 Attachments

Previous articleVakeel Saab USA theatre list
Next articleVakeel Saab Trailer