second heroine for vijay devarakonda puri Fighter movie
second heroine for vijay devarakonda puri Fighter movie

(vijay devarakonda puri Fighter movie heroine) రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా డ్యాషింగ్ పురి జగన్నాథ్ దర్శకత్వంలో “ఫైటర్” అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ బాక్సర్ గా కనిపించనున్నాడని సమాచారం. ఈ సినిమా కొసం పూరి చాలా కసరత్తులే చేస్తున్నాడట. ఈ సినిమాని పాన్ ఇండియా బేస్ లో తెరకెక్కించడానికి వీలుగా సినిమా కథని సిద్ధం చేశాడట. ఫైటర్ లో విజయ్ కి జోడీగా శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శర వేగంగా పూర్తవుతున్నాయి.

పూరి- ఛార్మీ ముంబైలో మకాం వేసి సెకెండ్ హీరోయిన్ ఎంపిక చేసే పనిలో నిమగ్నమైనట్లు సమాచారం. ముంబై లో జల్లెడ పడుతున్నారు అంటే.. పూరి మరోసారి కొత్త మోడల్ ని దిగుమతి చేసే అవకాశం ఉంది. పూరి సీనియర్ హీరోయిన్లు కన్నా కొత్త నాయికలపైనే ఎక్కువ ఆసక్తిని చూపిస్తాడు. ఇప్పటివరకూ అలా ఎంతో మంది హీరోయిన్లను టాలీవుడ్ కి పరిచయం చేసి స్టార్ హీరోయిన్లను చేసాడు. మరో వైపు ఫైటర్ ని ఢీకొట్టడానికి బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ ని రంగంలోకి దింపుతున్నట్లు మరో వార్త టాలీవుడ్ సహా బాలీవుడ్ ని వెడెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఇక ఇందులో కార్తికేయ ఓ ఆసక్తికర పాత్రలో నటించనున్నారని వార్తలొచ్చాయి.

ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన పురి జగన్నాథ్ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద 30 కోట్లు సుమారుగా వసూలు చేసింది. ఈపుడు రౌడీ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్న ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుంటాడా లేదా చూడాలి. అలాగే విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరల్డ్ ఫేమస్ లవర్ అనే సినిమాతో ప్రేమికుల రోజున ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.