‘రిపబ్లిక్‌’ నుంచి రెండో పాట వచ్చేసింది..!

0
44
second song Jor Se from Sai tej Republic out now

Sai Tej Republic Song: సాయిధరమ్‌ తేజ్‌ కలెక్టర్‌ పాత్రలో నటిస్తున్న చిత్రం ‘రిపబ్లిక్‌’. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయాల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు సమాచారం. తాజాగా ఈ సినిమా నుంచి ఓ కొత్త పాటను చిత్రబృందం విడుదల చేసింది.

“సూడబోదుమా .. ఆడబోదుమా .. సెయ్యి సెయ్యి కలిపి సేరబోదుమా .. ” అంటూ ఈ పాట సాగుతున్న ఈ పాటను మణిశర్మ స్వరపరిచారు. జాతర వాతావరణంలో జనంతో కలిసి హీరో సాయి తేజ్‌ అదరగొట్టే డాన్స్‌తో ఆకట్టుకున్నాడు. హుషారెత్తించేలా ఉన్న ఈ పాటను అనురాగ్‌ కులకర్ణి, సాకీ శ్రీనివాస్ ఆలపించారు.

‘సోలో బ్రతుకే సో బెటర్‌’ తర్వాత సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది. దేవకట్టా దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సాయికి జోడీగా ఐశ్వర్యా రాజేశ్‌ సందడి చేయనున్నారు. రమ్యకృష్ణ, జగపతిబాబు కీలకపాత్రలు పోషించారు. కొంతకాలంగా సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్న సాయితేజ్ ముచ్చట ఈ సినిమా తీరుస్తుందేమో చూడాలి.