seerat kapoor selected as heroine for raviteja khiladi

Seerat Kapoor Ravi Teja: వరుస సినిమాలతో మంచి జోష్‌లో మాస్ మహారాజ్ రవితేజ మరొకొన్ని ఇంట్రెస్టింగ్ కథలను ఓకే చేశారని తెలుస్తోంది. అందులో ఒకటి రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘ఖిలాడీ’. ఈ మూవీలో హీరో రెండు వెరైటీ పాత్రలు పోషిస్తూ ద్విపాత్రాభినయం చేస్తాడని తెలుస్తోంది. అందుకే చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్‌కి స్కోప్ ఉందట. ఈ క్రమంలో ఇప్పటికే హాట్ బ్యూటీలు రాశీ ఖన్నా, నిధి అగర్వాల్ పేర్లు బయటకురాగా.. తాజాగా మరో గ్లామర్ గర్ల్ సీరత్ కపూర్ పేరు చెక్కర్లు కొడుతోంది.

`రన్ రాజా రన్` సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత పలు సినిమాల్లో హాట్ హాట్ పాత్రల్లో మెరిసిన సీరత్ కపూర్.. ఖిలాడీ రవితేజతో రొమాన్స్ చేయనుందని అంటున్నారు. ఈ మేరకు డైరెక్టర్ రమేష్ వర్మ ఆమెతో సంప్రదింపులు చేస్తున్నారట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతున్నట్టు తెలుస్తోంది. రవితేజ మేనరిజానికి సూటయ్యేలా పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ కథ రెడీ అవుతోందని టాక్. రవితేజ, సీరత్ కలిసి గతంలో `టచ్ చేసి చూడు` సినిమాలో నటించారు.

మరోవైపు రవితేజ లేటెస్ట్ మూవీ ‘క్రాక్’ షూటింగ్ ఫినిష్ చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను మే 8నే విడుదల చేయాల్సి ఉండగా.. లాక్‌డౌన్ కారణంగా వాయిదా వేశారు. థియేటర్స్ ఓపెన్ కాగానే ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రంలో రవితేజ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటించింది.