Senior Actor's prathap pothan Shocking comments on Chiranjeevi reunion party
Senior Actor's prathap pothan Shocking comments on Chiranjeevi reunion party

హైదరాబాద్ లోని మెగా స్టార్ చిరంజీవి కొత్త ఇంట్లో 80వ దశకంలోని స్టార్స్ తో గ్రాండ్ పార్టీ జరిగింది. దక్షిణాది భాషల స్టార్స్ మాత్రమే కాకుండా.. బాలీవుడ్ నుండి జాకీ ష్రాఫ్ కూడా హాజరయ్యారు. దక్షిణాది లోని గొప్ప నటుల్లో ప్రతాప్ పోతెన్ కూడా ఒకరు. ఆయన దాదాపు 100కు పైగా సినిమాల్లో దక్షిణాదిన నటించారు. అంతేకాకుండా దర్శకుడిగా కూడా అవతారం ఎత్తారు. ఆయన్ను చిరంజీవి ఇంట్లో జరిగిన ఈ పార్టీకి ఆహ్వానించలేదు. దీంతో ఆయన బాధపడుతూ.. తన సోషల్ మీడియా అకౌంట్ లో ఓ పోస్టు పెట్టారు.

తాను కూడా 80 దశకంలోని స్టార్ నే అని..! తనను ఒక చెత్త యాక్టర్ గానూ.. దర్శకుడి గానూ భావించి ఆహ్వానించలేదేమో అని బాధపడ్డారు. కొందరు మిమ్మల్ని ఇష్టపడొచ్చు.. మరికొందరు ఇష్టపడకపోవచ్చు.. జీవితం సాగిపోతూ ఉంటుంది అని ఆయన వేదాంతం మాట్లాడారు. ఆయన అభిమానులు మాత్రం.. బాధపడకండి సార్.. మీరు కూడా గొప్ప నటులే.. అని ఆయనకు అండగా నిలిచారు. ఇక ఈ పార్టీకి హాజరైన పలువురు ప్రముఖులు ఈవెంట్ కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. కానీ ఇప్పటిదాకా ఏ ఒక్కరు కూడా ప్రతాప్ పోతెన్ వ్యాఖ్యలపై స్పందించలేదు.

ఎయిటీస్ స్టార్స్ రీయూనియన్ పార్టీ హైదరాబాద్ లోని చిరంజీవి ఇంట్లో సందడి సందడిగా జరిగింది. చాలా మంది అప్పటి స్టార్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తూ కనిపించారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్, టాలీవుడ్ – కోలీవుడ్ స‌హా మ‌ల‌యాళం.. క‌న్న‌డం నుంచి మొత్తం 40 మంది తార‌లు ఈ వేడుక‌కు హాజ‌ర‌య్యారు. ఈ పార్టీలో మెగాస్టార్ చిరంజీవి, మోహన్ లాల్, వెంకటేశ్, నాగార్జున మెయిన్ అట్రాక్షన్ గా నిలిచారు. సుహాసిని, ఖుష్బూ, రాధిక, లిజీ, సుమలత ఆర్గనైజర్స్ గా ఉన్నారు. వీకే నరేశ్, అర్జున్, జాకీ ష్రాఫ్, రమ్యకృష్ణ, ప్రభు, శోభన, భాగ్యరాజ, శరత్ కుమార్, సత్యరాజ్, జయరామ్, నదియా, సుమన్ లు సందడి చేశారు. బాలకృష్ణ, కమల్ హాసన్, రజనీకాంత్, రాజశేఖర్ హాజరుకాలేక పోయారు.