ఆర్ఆర్ఆర్‌లో 8 నిమిషాల సెన్సేష‌న‌ల్ సాంగ్

0
54
Sensational 8 minute song in RRR movie

RRR Songs: రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ – రామ్ చరణ్ కథానాయకులుగా నటిస్తున్న భారీ మల్టీస్టారర్ ”ఆర్.ఆర్.ఆర్”. అలియా భట్ – ఒలీవియా మోరీస్ కథానాయికలుగా నటిస్తున్నారు. కోవిడ్ నేపథ్యంలో నిలిచిపోయిన ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారభమైంది. త‌న సినిమాల్లో యాక్ష‌న్ ఘ‌ట్టాల‌నే కాదు.. పాట‌ల‌ను కూడా ఉద్వేగ‌భ‌రితంగా, ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా తీస్తుంటాడు రాజ‌మౌళి.

‘ఆర్.ఆర్.ఆర్’ కోసం ఎన్టీఆర్ – రామ్ చరణ్ లపై జక్కన్న ఓ స్పెషల్ సాంగ్ ను చిత్రీకరించనున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీని కోసం ఇప్పటికే రామోజీ ఫిల్మ్ సిటీలో సెట్ నిర్మాణం చేపట్టారు. 25 నుంచి 30 రోజులు షూట్ చేయాలని ప్లాన్ చేసిన ఈ పాట సినిమాలో చాలా ప్రత్యేకంగా నిలుస్తుందని టాక్.

అది టాలీవుడ్లో ప్ర‌త్యేకంగా నిలిచిపోయే పాట అవుతుంద‌ని చిత్ర వ‌ర్గాలు అంటున్నాయి. ఏకంగా 8 నిమిషాల నిడివితో సుదీర్ఘంగా, ఉద్వేగ‌భ‌రితంగా ఆ పాట సాగుతుంద‌ట‌. జులైలో కొత్త షెడ్యూల్ మొద‌లుపెట్ట‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. చిత్ర ప్ర‌ధాన తారాగ‌ణ‌మంతా షూటింగ్‌లో పాల్గొన‌బోతోంది. వీలైనంత త్వ‌ర‌గా చిత్రీక‌ర‌ణ పూర్తి చేసి.. ఆ త‌ర్వాత దాదాపు ఆరు నెల‌లు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌పై కూర్చోబోతున్నారు.