ఈ వారం థియేటర్‌ లో రిలీజ్ మూవీస్ లిస్ట్ ..!

0
2399
September 2021 first week Telugu Movies Releases

కరోనా సినిమా ఇండస్ట్రీపై ఎంతగా ప్రభావం చూపిందో తెలిసిందే. అయితే సెకండ్ వేవ్ తరువాత థియేటర్లు తెరుచుకోవడంతో ఒక్కొక్కటిగా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. యితే, అసలైన జోష్‌ మాత్రం రావడం లేదు. ఇంకా కరోనా భయాలు వీడకపోవడం, నిబంధనల కారణంగా ఏపీలో థియేటర్‌లు పూర్తిగా అందుబాటులో లేకపోవడం దీని కారణం.

అయితే, గత నెల రోజులతో పోలిస్తే, ఈ వారం అటు థియేటర్‌, ఇటు ఓటీటీలోనూ కాస్త సందడి రెట్టింపు కానుంది. మరి వినాయకచవితిని పురస్కరించుకుని ఆ సందడి పంచే కథానాయకులు ఎవరు? ఏయే చిత్రాలు వస్తున్నాయి?

1. విజయ్‌ సేతుపతి ‘లాభం’

Vijay Sethupathi and Shruti Haasan Laabam movie release on september 9

విజయ్‌ సేతుపతి కథానాయకుడిగా నటిస్తున్న తమిళ చిత్రం ‘లాభం’. శ్రుతిహాసన్‌ కథానాయిక. జగపతిబాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. ఎస్‌.పి.జననాథన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ తమిళ చిత్రం అదే పేరుతో తెలుగులోనూ విడుదల కానుంది. సెప్టెంబరు 9న థియేటర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

2. గోపీచంద్‌ ‘సీటీమార్‌’ 

Gopichand next Seetimaarr done with Censor formalities

గోపీచంద్‌ కథానాయకుడిగా సంపత్‌ నంది దర్శకత్వంలో తెరకెక్కిన స్పోర్ట్స్‌ యాక్షన్‌ డ్రామా ‘సీటీమార్’. తమన్నా కథానాయిక. వేసవి కానుకగా రావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు వినాయకచవితి కానుకగా సెప్టెంబరు 10న థియేటర్స్‌లో విడుదల కానుంది. ఇందులో గోపీచంద్‌, తమన్నాలు ఆంధ్రా, తెలంగాణ కబడ్డీ జట్ల కోచ్‌లుగా కనిపించనున్నారు.

3. కంగనా రనౌత్‌ ‘తలైవి’

kangana ranaut thalaivi release in september 10

దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా ఏఎల్‌ విజయ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘తలైవి’. కంగనా రనౌత్‌ టైటిల్‌ రోల్‌ పోషిస్తున్నారు. ఎంజీఆర్‌గా అరవిందస్వామి అలరించనున్నారు. వినాయకచవితి సందర్భంగా సెప్టెంబరు 10న తమిళ/తెలుగు భాషల్లో థియేటర్‌లో విడుదల కానుంది.

4. ‘జాతీయ రహదారి’

Jathiya Rahadari movie release on september 10

‘1940లో ఒక గ్రామం’, ‘కమలతో నా ప్రయాణం’, ‘లజ్జ’ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు నరసింహ నంది. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘జాతీయ రహదారి’. మధుచిట్టి, సైగల్ పాటిల్, మమత, ఉమాభారతి, మాస్టర్ దక్షిత్ రెడ్డి, అభి, శ్రీనివాస్ పసునూరి ప్రధానపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా సెప్టెంబరు 10న థియేటర్‌లో విడుదల కానుంది.