‘షాదీ ముబారక్’: క్యూట్ లవ్ స్టోరీ అంటోన్న ఆడియన్స్

265
Shaadi Mubarak Telugu Review Rating

Shaadi Mubarak Telugu Review
విడుదల తేదీ : మార్చ్ 05, 2021
రేటింగ్ : 2.5/5
నటీనటులు : ఆర్.కె సాగర్, దృశ్యం రఘునాథ్.
దర్శకత్వం : పద్మశ్రీ
నిర్మాత‌లు : సిరిష్ – లక్ష్మణ్

నటుడు సాగర్ ప్రేక్షకులకు కొత్త కాదు, అతను తెలుగు రాష్ట్రాల్లో మంచి అభిమానులను అనుసరిస్తాడు. స్మాల్ స్క్రీన్స్ ప్రేక్షకులకు అతను పాపులర్ స్టార్, తన తెలుగు టివి సబ్బు మొగాలియర్కులు మరియు చక్రవకంలకు కృతజ్ఞతలు. నాలుగన్నరేళ్ల క్రితం ‘సిద్దార్థ’ అనే సినిమాతో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా సాగర్‌కు ఏవిధంగానూ కలిసిరాలేదు. దీంతో సుధీర్ఘ విరామం తీసుకున్న సాగర్.. ఇప్పుడు ‘షాదీ ముబారక్’ అనే సినిమాతో లవర్ బాయ్‌గా తనను తాను కొత్తగా ఆవిష్కరించుకున్నారు. ఈ చిత్రం ఈ రోజు తెరపైకి వచ్చింది.

కథ: సున్నిపెంట మాధ పాత్రను సాగర్ పి.కె పోషించారు. నిజమే, అతను తన భారత పర్యటనలో వధువు కోసం వెతుకుతాడు. అతను మ్యారేజ్ బ్యూరోతో సంబంధాలు పెట్టుకుంటాడు మరియు పెళ్ళి సంబంధాల యజమాని అతనికి మంచి మ్యాచ్ లభిస్తుందని వాగ్దానం చేశాడు. దురదృష్టవశాత్తు, యజమాని దానిని చేయలేడు. ఈ క్రమంలో ఆ మ్యారేజ్ బ్యూరోను నిర్వహించే మ‌హిళ మాధ‌వ్‌ను పెళ్లి చూపుల‌కు తీసుకెళ్లే బాధ్య‌త‌ల‌ను త‌న కుమార్తె స‌త్య‌భామకు అప్ప‌గిస్తుంది మ్యాచ్‌లకు వెళ్లేటప్పుడు వీరిద్దరూ ఎలా ప్రేమలో పడతారనేది మిగతా కథ.

నటీనటులు: వీర సాగర్ చక్కగా నటించాడు. సీరియల్స్ లో మాదిరి మనసుల్ని పిండేసే భారీ సెంటిమెంట్స్ సీన్స్ లేకుండా జాగ్రత్త పడ్డాడు. తన వరకూ తన పాత్రను చక్కగా పోట్రేట్ చేశాడు. క‌థా ప‌రంగా డిజైన్ చేసిన త‌న పాత్ర‌లోని కామెడీతో ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశాడు. ఇక హీరోయిన్ దృశ్యా ర‌ఘునాథ్‌.. తొలి సినిమానే అయినా, న‌ట‌న‌తో చ‌క్క‌గా ఆక‌ట్టుకుంది. డ్రైవ‌ర్ ర‌మేష్ పాత్ర‌లో రాహుల్ రామ‌కృష్ణ ఒదిగిపోయాడు.

RK Naidu Shaadi Mubarak Review Rating

రాజశ్రీ నాయర్‌ ఓన్ డబ్బింగ్ చెప్పినట్టుగా అనిపిస్తోంది. తెలుగు పదాలు పలకడానికి కాస్తంత ఇబ్బంది పడ్డారామె. ఇక హీరో తల్లిదండ్రులుగా హేమ, బెనర్జీ నటించారు. ఎన్నారై పెళ్లికొడుకుగా మిర్చి హేమంత్ అదరగొట్టాడు. భద్రం కామెడీ కూడా సూపర్… వీళ్ళిద్దరూ కనిపించేది రెండు మూడు సీన్స్ లోనే అయినా… సినిమాలో వాళ్ళ ప్రెజెన్స్ చాలా కీలకం.

సాంకేతిక విభాగం: సంగీత దర్శకుడు సునీల్ కశ్యప్‌ నేపథ్య సంగీతం బాగుంది. పాటల బాణీలు మాత్రం అప్ టు ద మార్క్ లేవు. శ్రీకాంత్ నారోజ్ సినిమాటోగ్రఫీ ఓకే. ద‌ర్శ‌కుడు ప‌ద్మ‌శ్రీ విష‌యానికి వ‌స్తే అంద‌రికీ తెలిసిన ల‌వ్‌స్టోరినీ ఎంట‌ర్‌టైనింగ్‌గా చ‌క్క‌గా మ‌లిచాడు. స‌న్నివేశాల‌ను డీవియేట్ చేయ‌నీయ‌కుండా చ‌క్క‌టి డైలాగ్స్‌తో ఎక్క‌డా బోర్ అనిపించ‌కుండా సినిమా సాగుతుంది. అలానే వీర్ సాగర్ తన స్నేహితులతో కలిసి మొదలు పెట్టిన ఈ సినిమా కథ నచ్చి, దానిని టేకోవర్ చేసిన నిర్మాతలు దిల్ రాజు – శిరీశ్‌ లనూ అప్రిషియేట్ చేయాలి.

ప్లస్ పాయింట్స్
నటీనటుల నటన
ఆకట్టుకునే హాస్య సన్నివేశాలు
దర్శకుడు పద్మశ్రీ కథ, కథనాలు

మైనెస్ పాయింట్స్
ఆకట్టుకోని బాణీలు
ద్వితీయార్ధంలోని లాగ్

కథనం:

తొలి రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో రొటీన్‌ యాక్షన్‌ డ్రామాల జోలుకు పోకుండా సాగర్ మంచి పని చేశాడు. ఓ కూల్ బ్రీజ్ లవ్ స్టోరీ ని ఎంపిక చేసుకున్నాడు. కథలో పెద్ద పాయింట్ లేకపోయినా… సినిమా ఆద్యంతం ఆహ్లాదరకంగా, వినోదాత్మకంగా సాగిపోయే జాగ్రత్తలు తీసుకున్నాడు. ఫస్ట్ హాఫ్ అంతా ఒక కారులోనే కథను నడిపిస్తూ.. అది కూడా ఎక్కడా బోర్ కొట్టకుండా దర్శకుడు పద్మశ్రీ రాసుకున్న స్క్రీన్ ప్లే ఆకట్టుకుంటుందని అంటున్నారు. పెళ్లి చూపులకు అబ్బాయిని తీసుకెళ్లిన అమ్మాయి.. కొన్ని గంటల్లోనే అతడి ప్రేమలో పడటం.. ఆ తర్వాత ఆ ఇద్దరు ఎలా కలిశారు అనే కథనాన్ని దర్శకుడు రాసుకున్న తీరు బాగుందని చెబుతున్నారు.

స‌న్నివేశాల‌ను డీవియేట్ చేయ‌నీయ‌కుండా చ‌క్క‌టి డైలాగ్స్‌తో ఎక్క‌డా బోర్ అనిపించ‌కుండా సినిమా సాగుతుంది. కామెడీ డైలాగ్స్‌తో పాటు ప్రేమ‌, పెళ్లి గొప్ప‌త‌నాన్ని గురించి చెప్పే సంద‌ర్భాల్లో వ‌చ్చే డైలాగ్స్ ఆక‌ట్టుకుంటాయి. ద్వితీయార్థంలో అసలు కథ మొదలవుతుంది. తనను అపార్థం చేసుకున్న వారికి వివరణ ఇవ్వడం, తన లవ్ స్టోరీని సక్సెస్ చేసుకోవడం జరుగుతుంది. ఈ క్రమంలో ప్రథమార్థంతో పోల్చితే సినిమా ద్వితీయార్ధం కాస్తంత వేగం తగ్గింది.

అలానే చాలా పాత్రలకు సరైన ఎండింగ్ ఇవ్వలేదు. దాంతో అబ్రాప్ట్ గా సినిమాను దర్శకుడు ముగించేశాడనిపిస్తుంది. సెకండాఫ్ లో ఆర్‌.జె.హేమంత్ త‌న వంతుగా న‌వ్వించాడు. అయితే ఓవర్ ఆల్ గా చూసినప్పుడు చాలా రోజుల తర్వాత ఓ ఫన్నీ ఎంటర్ టైనర్ ను వాచ్ చేశామనే భావన కలుగుతుంది. గడిచిన రెండు నెలల్లో ఇంత లైటర్ వీన్ కామెడీ మూవీ రాలేదనే చెప్పాలి. హీరో స్నేహితుడిగా భద్ర‌మ్ పాత్ర ప్రేక్ష‌కుల‌కు న‌చ్చుతుంది.