Shaakuntalam Review in Telugu: చాలాకాలం సినిమా నుంచి గ్యాప్ తీసుకున్న తర్వాత గత సంవత్సరం యశోదతో బాక్సాఫీస్ సందడి చేసిన భామ సమంత. అయితే ఈ చిత్రం పర్వాలేదు అనే టాక్ ని సొంతం చేసుకోవడంతో ఆమె తన ఫోకస్ అంతా నెక్స్ట్ మూవీ శాకుంతలపై పెట్టింది. ఎలాగైనా ఈ చిత్రంతో పాన్ ఇండియా స్టార్ అయిపోవాలి అని సమంత ఆశపడింది. భారీ హంగామా తో త్రీడీ గ్రాఫిక్స్ తో రూపొందిన ఈ చిత్రం పై ప్రేక్షకులకు మంచి అంచనాలే ఉన్నాయి. ఈరోజు విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో తెలుసుకుందాం…
Shaakuntalam Telugu Review & Rating: 2/5
నటీనటులు: సమంత, దేవ్ మోహన్, మోహన్ బాబు, అదితి బాలన్, అనన్య నాగళ్ల, ప్రకాశ్ రాజ్, గౌతమి, అల్లు అర్హ తదితరులు
సంగీతం: మణిశర్మ
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
నిర్మాణ సంస్థ: గుణ టీమ్వర్క్స్,శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్
స్క్రీన్ప్లే దర్శకత్వం: గుణశేఖర్
విడుదల: 14-04-2023
స్టోరీ: శాకుంతలం చిత్రం మనకు తెలియంది కాదు…ఇది కాళిదాసు విరచించిన అభిమాన శాకుంతలం అనే గొప్ప కావ్యం. ఘోర తపస్సు చేసే విశ్వామిత్రుని పక్కదారి పట్టించడానికి ఇంద్రుడు మేనకను భూలోకానికి పంపిస్తాడు. మేనకా అందచందాలకు కరిగిన విశ్వామిత్రుడు ఆమె ప్రేమలో పడతాడు. ఈ ఇద్దరి ప్రేమకు ఫలితంగా ఓ ఆడబిడ్డ కూడా జన్మిస్తుంది. నరుడి వల్ల కలిగిన బిడ్డ కాబట్టి ఆ బిడ్డను మేనక స్వర్గలోకానికి తీసుకుపోలేదు. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో ఆ బిడ్డను భూలోకాన్ని వదిలి వెళ్తుంది. ఇటు విశ్వామిత్రుడు కూడా తిరిగి తన తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాడు.
అడవిలో ఒంటరిగా ఉన్న ఆ చిన్నారిని ఓ పక్షుల గుంపు మాలినీ నది తీరాన ఉన్న కన్వ మహర్షి ఆశ్రమ ప్రాంతంలో వదిలి పెడుతుంది. ఆ పాపను దైవప్రసాదంగా భావించి దత్తత తీసుకొని పెంచుతాడు కన్వ మహర్షి. ఆ అమ్మాయికి శకుంతల అని పేరు పెట్టాడు. ఎంతో ప్రశాంతంగా ఉన్న కనుమ మహర్షి ఆశ్రమానికి ఒకనాడు దుష్యంత మహారాజు విచ్చేస్తాడు. శకుంతల ను చూసి ఇష్టపడి ఆమెను గాంధర్వ వివాహం చేసుకుంటాడు.
ఇద్దరూ కొంత కాలం అన్యోన్యంగా దాంపత్యం చేసిన తర్వాత త్వరలో వచ్చి తీసుకువెళ్తానని మాట ఇచ్చి దృశ్యంతుడు రాజ్యానికి వెళ్తాడు. తన గుర్తుగా శకుంతలకు ఓ ఉంగరాన్ని కూడా బహుకరిస్తాడు. దుష్యంతుడు వెళ్లిన తర్వాత శకుంతలకు తాను గర్భవతి అన్న విషయం తెలుస్తుంది. ఎంతకీ దుష్యంతుడు రాకపోవడంతో నెలలు నిండుతున్న శకుంతలను కణ్వ మహర్షి దుష్యంతుడి రాజ్యానికి పంపిస్తాడు. కానీ ఎవరు ఊహించని విధంగా దృశ్యంతుడు ఆమె ఎవరో తెలియదు అని చెప్పి పరాభవించి వెనక్కి పంపిస్తాడు.
శకుంతలను దుష్యంతుడు ఎందుకు మోసం చేశాడు? తిరిగి వీళ్ళిద్దరూ ఎలా కలుసుకుంటారు? దుష్యంతుడికి శకుంతల కి పుట్టిన బిడ్డ ఏమవుతాడు? తెలుసుకోవాలి అంటే మాత్రం సినిమా చూడాల్సిందే. కాళిదాసు అద్భుతంగా రచించిన ఓ సుందర ప్రేమ కావ్యం కు కాస్త హంగు ఆర్భాటం జోడించి గుణశేఖర్ తనదైన శైలిలో ఓ అపురూప దృశ్య కావ్యం గా ఆవిష్కరించడానికి ప్రయత్నం అయితే చేశాడు. అయితే ఈ కథ అందరికీ తెలిసింది కాబట్టి ఇందులో సస్పెన్స్ అనేది ఏదీ లేదు. అయినప్పటికీ కథను ఆకట్టుకునేలా చెప్పగలిగితే మరింత బాగుండేది. ప్రేమకావ్యం చదువుతున్నప్పుడు కలిగే అనుభూతి చిత్రం చూస్తున్నప్పుడు కలగలేదు అనేది కొందరి భావన.
సినిమాలో చూపించిన త్రీడి హంగులలో కూడా ఊహించినంత ఎఫెక్ట్ లేదని చెప్పవచ్చు. పాత్రలను పరిచయం చేసిన విధానం ఆకట్టుకునే లాగా ఉన్నప్పటికీ విజువల్ ఎఫెక్ట్స్ పేలవంగా ఉండడం వల్ల కాస్త అసహజంగా ఉందని చెప్పవచ్చు. ఆశ్రమం ప్రాంతం ,అందులో చూపించిన జంతువులు, పక్షులు వీటిని ఇంకా అద్భుతంగా చిత్రీకరిస్తే సినిమా ఇంకా ఆసక్తిగా ఉండేది.
మరోపక్క హీరో హీరోయిన్ల మధ్య పాత్రకి ఉండాల్సినంత కెమిస్ట్రీ లేదు అనేది స్పష్టంగా తెలుస్తోంది. దూర్వాస మహర్షి ఎంట్రీ కథలో కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉంది. అలాగే సభలో శకుంతలకు జరిగే అవమానం, ఆమెను ప్రజలు రాళ్లతో కొట్టి చంపడానికి ప్రయత్నం చేయడం వంటి సన్నివేశాలు కాస్త ఆసక్తికరంగా ఉన్నాయి.కాలానీములు మరియు దుష్యంతుడు మధ్య జరిగే యాక్షన్ ఎపిసోడ్ అంతగా ఆకట్టుకునే విధంగా లేదు.
ఎవరు ఏ పాత్రలో మెప్పించారు: సమంత శకుంతల పాత్రకు తన శక్తివంచన లేకుండా శ్రమించడం వల్ల అద్భుతంగా సరిపోయిందని చెప్పవచ్చు. కానీ కొన్ని భావోద్వేగా భరిత సన్నివేశాలలో శకుంతల క్యారెక్టర్ లో సమంత సింక్ కాలేకపోయింది.దేవ్ మోహన్ మంచి ఫిజిక్ తో దుష్యంతుడు పాత్రకు సెట్ అయినప్పటికీ నటనపరంగా కాస్త కృత్రిమత్వం కనిపిస్తుంది.
కొద్దిగా సేమ్ ఉన్న నటుడిని ఆ క్యారెక్టర్ కి తీసుకొని ఉంటే సినిమాకి కాస్త మార్కెట్ వాల్యూ పెరిగేది అని టాక్. మోహన్ బాబు దుర్వాస మహర్షి క్యారెక్టర్ కి బాగా సెట్ అయ్యాడు. ఇంటర్వెల్ సీన్ కి ముందు మోహన్ బాబు దుర్వాస మహర్షిగా మాట్లాడుతుంటే నిజంగా దుర్వాసుడిని చూసినట్లు జనాలు ఫీలయ్యారు. అల్లు అర్హ మొదటి చిత్రం అయినప్పటికీ భరతుడి క్యారెక్టర్ లో అద్భుతంగా నటించింది. సచిన్, అనన్య, మధుబాల, జిషు సేన్ గుప్తా.. ఇలా అందరూ తమ క్యారెక్టర్స్ ని బాగా పోషించారు.
పాజిటివ్ పాయింట్స్: భరతుడిగా అల్లు అర్హ యాక్షన్ మరియు సంభాషణలు ముచ్చటగా ఉన్నాయి. అలాగే మణిశర్మ సంగీతం చిత్రానికి ప్రాణం పోసింది. పాటలు ఎంతో ఆహ్లాదంగా, మనసును ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఇంటర్వెల్ మరియు పతాక సన్నివేశాలు మూవీ కి హైప్ క్రియేట్ చేసింది. సమంత యాక్షన్ ఈ చిత్రానికి పెద్ద పాజిటివ్ పాయింట్ అని చెప్పవచ్చు.
మైనస్ ప్పాయింట్స్: కథ కాస్త సాగదీత గా ఉంది. తెరపైన క్యారెక్టర్ల మధ్య కెమిస్ట్రీ అంతగా వర్కౌట్ అవ్వలేదు. గ్రాఫిక్స్ ఆకట్టుకోలేని విధంగా పేలవంగా ఉన్నాయి.
తుది తీర్పు: వీకెండ్ మూవీ చూడాలి అనుకునే వాళ్ళకి పర్లేదు కానీ సినిమాలో లాజిక్ ఆలోచించే వాళ్లకు మాత్రం ఈ చిత్రం పెద్దగా నచ్చకపోవచ్చు. సమంతా వీరాభిమానులైతే మాత్రం కచ్చితంగా ఈ మూవీ చూసి ఎంజాయ్ చేస్తారు.