దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన RRR.. ఇండియన్ సినిమాకు ఎన్నో ఏళ్లుగా కలగా మిగిలిపోయిన ఆస్కార్ ను సాకారం చేసింది. ‘నాటు నాటు’ పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అవార్డు అందుకుని చరిత్ర సృష్టించింది. దీంతో ఇప్పుడు వరల్డ్ వైడ్ గా మన తెలుగు సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. అయితే దేశానికే గర్వకారణంగా నిలిచిన RRR మరియు ‘నాటు నాటు’ పై బాలీవుడ్ జనాలు కొందరు తమ అక్కసు వెళ్లగక్కుతున్నారు.
RRR సినిమా ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ సహా పలు ఇంటర్నేషనల్ అవార్డులను సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అట్టహాసంగా జరిగిన ఆస్కార్ అవార్డ్స్ వేడుకలో సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, రచయిత చంద్రబోస్ లు ‘నాటు నాటు’ పాటకు గాను అవార్డ్ అందుకున్నారు. హాలీవుడ్ సాంగ్స్ ను వెనక్కి నెట్టి పురస్కారం సాధించడంతో, దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇది చూసి పలువురు బాలీవుడ్ ప్రముఖులకు కుళ్ళు పుట్టింది. ఈ నేపథ్యంలో ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకున్న ట్రిపుల్ ఆర్ సినిమాపై విషం కక్కుతున్నారు.
బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మేకప్ ఆర్టిస్ట్ షాన్ ముత్తతిల్ ‘నాటు నాటు’ సాంగ్ కు ఆస్కార్ రావడంపై నెగటివ్ కామెంట్స్ చేశాడు. ”ఇండియాలో మాత్రమే అవార్డులు డబ్బుతో కొనొచ్చని నేను భావించాను. కానీ, ఆస్కార్ అవార్డులు అమ్ముడవడం చూస్తున్నాను. అంతా డబ్బుతోనే జరుగుతుంది. మన దగ్గర డబ్బుంటే ఏదైనా పొందవచ్చు” అని సంచలన వ్యాఖ్యలు చేశాడు షాన్.
అలానే బాలీవుడ్ నటి అనన్య ఛటర్జీ సైతం RRR సాంగ్ కు ఆస్కార్ అవార్డు రావడంపై ఇలాంటి కామెంట్సే చేసింది. ‘నాటు నాటు’ పాటను చూసి ఎందుకు గర్వపడాలి? నాకు అర్థం కావడం లేదు. అసలు ఈ సాంగ్ గురించి నిజంగా గర్వించాలా? మనం ఎక్కడికి వెళ్తున్నాం అని అనన్య నెగటివ్ కామెంట్స్ చేసింది.
RRR మూవీ, నాటు నాటు పాటపై విమర్శలు చేసిన నేపథ్యంలో.. షాన్ ముత్తతిల్, అనన్య ఛటర్జీలపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. భారతీయ సినిమా స్థాయిని పెంచిన చిత్రంపై నెగటివ్ కామెంట్స్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక తెలుగు సినిమా ఇంతటి గొప్ప ఘనత సాధించినందుకు బాలీవుడ్ లో కొందరు జెలసీగా ఫీల్ అవుతున్నారని దుమ్మెత్తిపోస్తున్నారు.
Jacqueline Fernandez’ makeup artist Shaan Muttathil alleges historic ‘Naatu Naatu’ Oscar win was bought: Thought only in India we could buy awards, gets slammed by netizens who call him ‘jealous’