Homeసినిమా వార్తలుఇంటర్నెట్‌ను షేక్ చేస్తోన్న షారూక్ ఖాన్ ‘జవాన్’ ప్రివ్యూ.!!

ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోన్న షారూక్ ఖాన్ ‘జవాన్’ ప్రివ్యూ.!!

Jawan prevue, Jawan Movie prevue Released, Shah Rukh Khan, Deepika Padukone, Nayanthara, Jawan Movie trailer, jawan Movie Teser Release Date, Jawan Release date

Jawan Movie Trailer: బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ (Shah Rukh Khan) మోస్ట్ అవెయిటెడ్ మూవీ ‘జవాన్’. హై యాక్షన్ థ్రిల్లర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ భారీ బ‌డ్జెట్ మూవీ ప్రివ్యూని (Jawan prevue) సోమ‌వారం (జూలై 10) రోజున విడుద‌ల చేశారు. ఈ ప్రివ్యూ ఇప్పుడు ఇంట‌ర్నెట్‌ను షేక్ చేసేస్తుంది. స‌మాజంలోని త‌ప్పుల‌న స‌రిదిద్ద‌డానికి ఓ వ్య‌క్తి చేసే ఎమోష‌న‌ల్ జ‌ర్నీయే జ‌వాన్ సినిమా అని ప్రివ్యూ చూస్తే అర్థ‌మ‌వుతుంది.

Jawan Movie Trailer: యాక్ష‌న్ ప్యాక్డ్‌గా రూపొందిన (Shah Rukh Khan) జ‌వాన్ మూవీ ప్రివ్యూ సినిమాపై ఉన్న అంచ‌నాల‌ను నెక్ట్స్ రేంజ్‌కు తీసుకెళ్లింది. భారీ విజువ‌ల్స్‌తో రూపొందుతోన్న ఈ సినిమాలో ప్రేక్ష‌కుల‌ను మెస్మ‌రైజ్ చేస్తుంది. ప్రేక్ష‌కుల‌కు ఓ అద్భుత‌మైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌నిచ్చింది. యాక్ష‌న్‌, ఎమోష‌న్స్ ప‌ర్‌ఫెక్ట్ కాంబినేష‌న్‌లో జ‌వాన్ అంద‌రినీ అల‌రిచంనుంద‌ని ప్రివ్యూలో చూపించారు. ప్రతి ఫ్రేమ్‌లో భారీత‌నం, గొప్ప విజువ‌ల్స్‌ను చూస్తుంటే ప్రేక్ష‌కులు ఊహించిన దాని కంటే ఎక్కువ‌గా సినిమా ఉంటుంద‌నిపిస్తుంది.

జ‌వాన్ ప్రివ్యూని (Jawan prevue) గ‌మ‌నిస్తే కింగ్ ఖాన్ షారూక్ వాయిస్ ఓవ‌ర్‌తో ప్రారంభం అవుతుంది. ప్ర‌తి ఫ్రేమ్ ఎగ్జ‌యిట్‌మెంట్‌ను పెంచుతూ వ‌చ్చింది. మ‌రీ ముఖ్యంగా షారూక్ ఖాన్ డిఫ‌రెంట్ లుక్స్ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి. ఇంత‌కు ముందెన్న‌డూ చూడ‌ని విధంగా షారూక్ లుక్స్ ఉన్నాయి. షారూక్‌తో పాటు న‌య‌న తార, దీపికా ప‌దుకొనె, ప్రియ‌మ‌ణి వంటి భారీ తారాగ‌ణం.. సినిమాలో భారీ విస్పోట‌న స‌న్నివేశాలతో రూపొందిన యాక్ష‌న్ సీక్వెన్స్‌, గ్రాండ్ స్కేల్‌లో తెర‌కెక్కిన పాట‌లు ఆక‌ట్టుకుంటున్నాయి. మ‌రీ ముఖ్యంగా ‘ఈ మౌనం, ఈ బిడియం…’ రెట్రో సాంగ్‌లో షారూ క్ పెర్ఫామెన్స్ మెప్పిస్తోంది.

వ‌రుస హిట్స్‌తో త‌న‌దైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ద‌ర్శ‌కుడు అట్లీ మ‌రోసారి త‌న‌దైన మార్క్ చూపించారు. ఈ సినిమాలో తను డైరెక్ట‌ర్‌గా నెక్ట్స్ లెవ‌ల్ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించార‌ని అర్థ‌మ‌వుతుంది. ఇక అనిరుద్ సంగీతం ప్రేక్ష‌కుల్లో మ‌రింత ఉత్సాహాన్ని నింపుతుంది. జవాన్‌లో గ్రామీ అవార్డ్స్‌లో నామినేట్‌కాబ‌డ్డ‌ అత్యంత ప్రజాదరణ పొందిన రాజా కుమారి రూపొందించిన ‘ది కింగ్ ఖాన్ రాప్’ మరింత జోష్‌ను నింపుతుంది. ఇవ‌న్నీ మ‌నం జ‌వాన్ ప్రివ్యూలో చూడొచ్చు.

Shah Rukh Khan Jawan Teaser Public talk
Shah Rukh Khan Jawan Teaser Public talk

ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీలో ఇప్ప‌టి వ‌ర‌కు రానీ విధంగా భారీ బ‌డ్జెట్‌తో పాటు భారీ తారాగ‌ణం ఈ సినిమాలో ఉంది. షారూక్ ఖాన్‌తో పాటు న‌య‌న‌తార‌, విజ‌య్ సేతుప‌తి, దీపికా ప‌దుకొనె, సాన్యా మ‌ల్హోత్రా, ప్రియ‌మ‌ణి, గిరిజ ఓక్‌, సంజిత భ‌ట్టాచార్య‌, లెహ్రా ఖాన్‌, అలియా ఖురేషి, రిది దోగ్రా, సునీల్ గ్రోవ‌ర్‌, ముఖేష్ చ‌బ్రా త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. నిజ‌మైన పాన్ ఇండియా మూవీగా జ‌వాన్ అల‌రించ‌టానికి సిద్ధ‌మ‌వుతుంది.

ఈ ఏడాది అభిమానులు, ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తోన్న సినిమాల్లో జ‌వాన్ ఒక‌టి అని చెప్ప‌టంలో సందేహం లేదు. పోస్ట‌ర్స్‌, టీజ‌ర్‌తో ఆస‌క్తి పెంచుతూ వ‌చ్చిన ఈ సినిమా ప్రివ్యూ ఇప్పుడు అంచ‌నాల‌ను మ‌రింత‌గా పెంచేసింది. రెడ్ చిల్లీస్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్ స‌మర్ప‌ణ‌లో గౌరీ ఖాన్ నిర్మాత‌గా జ‌వాన్ సినిమాను నిర్మిస్తున్నారు. అట్లీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. గౌర‌వ్ వ‌ర్మ స‌హ నిర్మాత‌. ప్ర‌పంచ వ్యాప్తంగా ‘జవాన్’ చిత్రం సెప్టెంబర్ 7న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది.

Jawan prevue, Jawan Movie prevue Released, Shah Rukh Khan, Deepika Padukone, Nayanthara, Jawan Movie trailer, jawan Movie Teser Release Date, Jawan Release date

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY