Homeసినిమా వార్తలుఆకట్టుకుంటోన్న జవాన్ ట్రైలర్.. సెప్టెంబర్ 7న విడుదల..!

ఆకట్టుకుంటోన్న జవాన్ ట్రైలర్.. సెప్టెంబర్ 7న విడుదల..!

Shah Rukh Khan Jawan Telugu Trailer, Nayanthara, Deepika Padukone and Vijay Sethupathi Jawan Telugu Trailer out now all set to hit theaters on September 7th.

Jawan Telugu Trailer: ఎట్టకేలకు ఎన్నో రోజులుగా అభిమానులు, ప్రేక్షకులు ఎదురు చూసిన సమయం రానే వచ్చింది. వారి నిరీక్షణకు తెర పడింది. గురువారం షారూఖ్ ఖాన్ హీరోగా నటించిన భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘జవాన్’ ట్రైలర్ విడుదలైంది. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూఖ్ నటించిన చిత్రం ‘జవాన్’. అట్లీ దర్శకుడు. నయనతార ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది.

Jawan Telugu Trailer: విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా మెప్పించనున్నారు. ఈరోజు నయనతార ఇన్ స్టాగ్రామ్ లోకి అడుగు పెట్టారు. ఇది ఆమె అభిమానులకు ఎంతో ఆనందకరమైన విషయం. అయితే ఆమె ముందుగా అందులో ‘జవాన్’ ట్రైలర్ ను పోస్ట్ చేయటం అందరినీ రెట్టింపు సంతోషాన్నిచ్చింది. శుక్రవారం నుంచి ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 7న ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది.

రీసెంట్ టైమ్ లో ‘జవాన్ ప్రివ్యూ’ పేరుతో విడుదల చేసిన గ్లింప్స్ కు అమేజింగ్ రెస్పాన్స్ రావటంతో పాటు అందరికీ ఇదొక సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ అనుభూతినిస్తుందని ఫిక్స్ అయ్యారు. సినిమా ఎప్పుడెప్పుడొస్తుందా అని ఎదురు చూడసాగారు. సినిమాలోని సాంగ్స్, థ్రిల్లింగ్ యాక్షన్ సీక్వెన్సులు,షారూఖ్ ఖాన్ మాగ్నటిక్ పెర్ఫామెన్స్ అన్నీ సినిమాపై అంచనాలను పెంచుతూ వచ్చాయి. ఈ క్రమంలో విడుదలైన జవాన్ ట్రైలర్ చూసిన అభిమానులు ఊర్రుతలూగుతున్నారు. అభిమానుల ఎక్స్ పెక్టేషన్స్ ను ఆకాశానికి చేర్చి నెట్టింట తెగ వైరల్ అవుతోందీ ట్రైలర్.

గూజ్ బమ్స్ తెప్పించే యాక్షన్, అడ్వెంచర్, థ్రిల్లింగ్ మూమెంట్స్ తో ‘జవాన్’ ట్రైలర్ ఫ్యాన్స్, ప్రేక్షకులను మరో లోకంలోకి తీసుకెళ్లింది. మరో వారంలోనే సినిమా ఆడియెన్స్ ముందుకు రానుంది. దీంతో కౌంట్ డౌన్ మొదలైంది. ట్రైలర్ ను గమనిస్తే అందులోని విజువల్స్ వావ్ అనిపించేలా ఉన్నాయి. కచ్చితంగా ఈ సినిమా సిల్వర్ స్క్రీన్ పై సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందనిపిస్తోంది. సెప్టెంబర్ 7న వస్తోన్న జవాన్ సినిమా ఎవరూ ఉహించని రేంజ్ లో భారీగా ప్రేక్షకులు ముందుకు రానుంది. మరచిపోలేని థియేట్రిక్ ఎక్స్ పీరియెన్స్ ని అందించనుంది.

షారూఖ్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న ‘జవాన్’ చిత్రాన్ని రెడ్ చిల్లీస్ ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్‌పై అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో గౌరీ ఖాన్ నిర్మిస్తున్నారు. గౌర‌వ్ వ‌ర్మ ఈ సినిమాకు స‌హ నిర్మాత‌. సెప్టెంబ‌ర్ 7న ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా హిందీ, తెలుగు, త‌మిళ భాషల్లో రిలీజ్ అవుతుంది.

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY