Shakeela Bigg Boss Buzz Interview Highlights : బిగ్ బాస్ 7 తెలుగు ప్రారంభం అయ్యి రెండు వారాలు ముగించుకొని మూడో వారంలోకి అడుగుపెట్టడం జరిగింది మొదటివారం కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ కాగా రెండోవారం షకీలా ఎలిమినేట్ అవ్వడం జరిగింది. ఇక మూడోవారం సోమవారం రోజు నామినేషన్ ముగించుకున్న తర్వాత ఈ వారం నామినేషన్ లో ఏడుగురు ఉన్నారు.
Shakeela Bigg Boss Buzz Interview Highlights : ఇక బిగ్ బాస్ 7 హౌస్ నుండి వచ్చిన వారితో బజ్ అంటూ ఇంటర్వ్యూ చేయటం లాస్ట్ సీజన్ నుండి ప్రారంభం అయ్యింది అలాగే ఇప్పుడు షకీలాను కూడా లాస్ట్ సీజన్ హౌస్ మేట్ అయిన రీతు వర్మ ఇంటర్వ్యూ చేయటం జరిగింది. ఈ ఇంటర్వ్యూలో షకీలా బిగ్ బాస్ హౌస్ గురించి అలాగే పోటీదారుల గురించి నమ్మనేని కొన్ని నిజాలని బయట పెట్టడం జరిగింది.. ఎవరు గురించి ఏమన్నదో ఒకసారి చూద్దాం పదండి.
శోభాశెట్టి: మాస్క్ తీయకుండా హౌస్ లో ఆడుతుంది ఎవరు అంటే అది శోభా సెట్ అని చెప్పవచ్చు అలాగే బద్ధకం ఎక్కువ..బాధ్యత తెలియదు.. తనకు తెలియకుండానే వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ లో పడిపోతుంది. రతిక మాత్రం బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది.
అమర్ దీప్: చాలా మంచివాడు.. ఫేక్ పర్సన్ అయితే కాదు.. ఎక్కడ ఎక్కువ ప్రేమ దొరుకుతుందా అని ఎదురుచూస్తూ ఉంటాడు.. చిన్న విషయానికి కూడా తట్టుకోలేడు…
పల్లవి ప్రశాంత్: వీడు వచ్చినప్పుడు ఒకరకంగా ఉన్నాడు వారం గడిచిన తర్వాత ఇంకో రకంగా ఉన్నాడు ఇప్పుడు వేరే రకంగా ఉన్నాడు.. పాపులారిటీ అనే పిచ్చితో ఇప్పుడు తన గొయ్య తానే తీసుకుంటున్నాడు..