షకీలా తెలుగు ట్రైలర్ టాక్

361
Shakeela Biopic Telugu Trailer Released and locked released date

నటి షకీలా జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘షకీలా’. రిచా చద్దా, పంకజ్‌ త్రిపాఠీ, ఎస్తర్‌ నోరన్హ, రాజీవ్‌ పిళ్లై, శివ రానా, కాజోల్‌ చుగ్, సందీప్‌ మలని కీలక పాత్రలు పోషించారు. ఇంద్రజీత్‌ లంకేశ్‌ దర్శకత్వంలో ప్రకాష్‌ పళని సమర్పణలో సమ్మి నన్వనీ, శరవణ ప్రసాద్‌ హిందీలో ‘షకీలా’ చిత్రాన్ని నిర్మించి, అన్ని భాషల్లో అనువదించారు. 90 దశకంలో థియేటర్లలో గోల పెట్టించిన నటి షకీలా. కొన్ని సందర్భాల్లో థియేటర్లు హౌజ్‌ఫుల్‌ కావాలంటే డిస్ట్రిబ్యూటర్లకు ఉన్న ఒకే ఒక ఆప్షన్ షకీలా అని భావించిన రోజులవి. అప్పట్లో ఆమె సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపించాయి.

వీటన్నింటి ఆధారంగా తీసుకొని ఆమె జీవితాన్ని వెండితెరపై చూపించబోతున్నారు డైరెక్టర్ ఇంద్రజీత్‌ లంఖేష్‌. ఈ బయోపిక్‌ని ‘షకీలా’ అనే పేరుతోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. హిందీ, తమిళ, కన్నడ భాషల్లో శుక్రవారం ఈ సినిమాని విడుదల చేయగా, జనవరి 1న యుఎఫ్‌ఓ మూవీస్‌ ద్వారా తెలుగులో రిలీజ్‌ చేస్తున్నారు. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ‘షకీలా’ తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు.

షకీలా పడ్డ కష్టాలు, సొంత కుటుంబ సభ్యుల నుండి ఆమెకు ఎదురైన అవమానాలు, మోసాలను ట్రైలర్‌లో చూపించారు. 2 నిమిషాల 20 సెకనుల నిడివితో కూడిన ఈ ట్రైలర్‌లో షకీలా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను చూపించి సినిమాపై ఆసక్తి పెంచేశారు. బోల్డ్‌ కంటెంట్‌ కారణంగా ఈ చిత్రానికి ‘ఎ’ సర్టిఫికెట్‌ లభించినప్పటికీ, ఈ చిత్రాన్ని అన్ని భాషల్లో సెన్సార్‌ బోర్డు కమిటీ ప్రశంసించింది. సినిమా థీమ్, మంచి సందేశానికి వారి నుండి ప్రశంసలు లభించాయి.. బాలీవుడ్‌ నటి రిచా చద్దా ఈ షకీలా మూవీలో టైటిల్‌ రోల్‌లో కనిపించనున్నారు. ఇటీవల వచ్చిన ‘మీర్జాపూర్‌’ సిరీస్‌తో అలరించిన నటుడు పంకజ్‌ త్రిపాఠి, మలయాళ నటుడు రాజీవ్‌ పిళ్లై ముఖ్య పాత్రలు పోషించారు.