Bigg Boss 7 Second week elimination: ముందుగా బిగ్ బాస్ 7 హౌస్ లో పల్లవి ప్రశాంత్ ని ఎలిమినేట్ చేసి సీక్రెట్ రూమ్ కి పంపిస్తారంటూ లీకైతే వచ్చింది. ఆ తర్వాత ట్రిపుల్ ఎలిమినేషన్ కూడా ఉంటుంది అని బయటికి వచ్చాయి. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం మేరకు ఈ వారం మామూలుగానే ఎటువంటి ఉల్టా ఫాల్తా ట్విస్ట్ లేకుండా ఎలిమినేషన్ జరుగుతుందని తెలుస్తుంది. బిగ్బాస్ హౌస్లో రెండవ వారం 9 మంది హౌస్ మేట్స్ ఎలిమినేషన్ లో ఉన్న విషయం తెలిసిందే. హౌస్ నుండి ఎవరు బయటకు వెళ్తున్నారు చూద్దాం.
బిగ్ బాస్ హౌస్ లో ఉన్న వారిలో పల్లవి ప్రశాంత్ కి ఎక్కువ ఓటింగ్ రావటం జరిగింది ఈసారి అలాగే వివిధ సంస్థల నిర్వహించిన ఓటింగ్ లో కూడా పల్లవి ప్రశాంత్ మొదటి స్థానంలో ఉండటం జరిగింది. చివరి స్థానాలలో షకీలా అలాగే శోభా శెట్టి ఉన్నారు. అలాగే ఈ వారం కూడా కొన్ని ప్రముఖ సంస్థలు నిర్వహించిన పోల్స్ లో వీళ్ళిద్దరూ చివరి స్థానాల్లో ఉన్నారు.
బిగ్ బాస్ హౌస్ లో రెండో వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు..? అని ఒపీనియన్ పోల్ నిర్వహించగా.. ప్రముఖ సంస్థలు times of india & News 18 & biggboss7teluguvote నిర్వహించిన పోల్ దాదాపు 50 వేల మంది ఓటింగ్ చేయటం జరిగింది. అత్యధికంగా నటి షకీలా ఎలిమినేట్ అవుతుందని 24 శాతం మంది తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. అమర్‌దీప్, శివాజీతో పాటు పల్లవి ప్రశాంత్‌కు ఇప్పటి వరకు అత్యధిక ఓట్లు వచ్చినట్లు సమాచారం.
మరోవైపు, షకీలా, యావర్ మరియు టేస్టీ తేజ డేంజర్ జోన్‌లో ఉండగా, షకీలా ఎవిక్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే, షకీలా పవర్ అస్త్రాన్ని పొందినట్లయితే ఆటలో ఒక ట్విస్ట్ ఉండవచ్చు, ఈ వారం యావర్ లేదా టేస్టీ తేజా ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. ఆ సోర్స్ నుండి కూడా అందుతున్న సమాచారం మేరకు షకీలా ఈ వారం హౌస్ నుండి ఎలిమినేట్ అవుతుందని తెలుస్తుంది.