Shakeela Gets Evicted from Bigg Boss 7: బిగ్ బాస్ తెలుగు 7 లేటెస్ట్ సీజన్ మొదలయ్యి రెండు వారాలు అవుతుంది. హౌస్ నుండి వరుసగా రెండో వారం కూడా ఒక ప్రముఖ నటి ఎలిమినేట్ అయింది. బిగ్ బాస్ మొదలైన దగ్గర్నుండి ప్రతిసారి ప్రేక్షకులు అందరూ ఆదివారం ఎప్పుడు వస్తుందా ఎవరు ఎలిమినేట్ అవుతారా హౌస్ నుండి అని ఎదురు చూసేవారు.
కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ సోమవారం ఎప్పుడు వస్తుందా ఎవరు ఎలిమినేషన్ లో ఉంటున్నారు అనేది ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు ఎవరు హౌస్ లో ఉంటున్నారు అనే విషయం ప్రేక్షకులకు ముందుగానే తెలుస్తుంది. ఈరోజు అంటే ఆదివారం విడుదల చేసిన ప్రోమోలో షకీలా (Shakeela) ఎలిమినేట్ అయినట్టు స్పష్టంగా తెలుస్తుంది.
Shakeela Gets Evicted from Bigg Boss 7:”బిగ్ బాస్ తెలుగు 7″ హౌస్ లో ఎలిమినేషన్ గ్రౌండ్లో ఈసారి 8 మంది ఉండగా వారిలో నిన్న ఒకరిని సేవ్ చేయడం జరిగింది. అయితే బిగ్ బాస్ సంబంధించిన ఓటింగ్ సిస్టం అఫీషియల్ గా కాకుండానే చాలా ప్రముఖ సంస్థలు నిర్వహిస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు పల్లవి ప్రశాంత్ ఓటింగ్లో మొదటి స్థానంలో ఉండగా చివరి స్థానంలో షకీలా అని తెలిసింది. అదేవిధంగా బిగ్ బాస్ హౌస్ నుండి రెండోవారం షకీలా ఎలిమినేట్ అవటం జరిగింది.
షకీలా టైటిల్ గెలవాలనే ఉద్దేశ్యంతో ఆమె షోలోకి ప్రవేశించింది, కానీ ఆమె పద్నాలుగు రోజుల తర్వాత హౌస్ నుండి బయటకు రావడం జరిగింది. షకీలా ఈ సీజన్‌లో బలమైన పోటీదారులలో ఒకరిగా ఉంటుందని భావించారు, కానీ దురదృష్టవశాత్తు, ఈ వారం ఎలిమినేషన్ సమయంలో ఆమె తొలగించబడింది.
బిగ్ బాస్ హౌస్ నుండి మొదటివారం బయటికి వచ్చిన పోటీదారులు కిరణ్ రాథోడ్ కాగా రెండో పోటీదారులుగా బయటకు వచ్చింది షకీలా (Shakeela). షకీలా మరియు కిరణ్ రాథోడ్ షో నుండి నిష్క్రమించిన తర్వాత, శివాజీ మాత్రమే మిగిలిన సినీ ప్రముఖులు. అయితే ‘బిగ్ బాస్ 7’ టీమ్ పాపులర్ పర్సనాలిటీలను వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా షోలోకి ఈ వారం తీసుకువచ్చే ఉద్దేశం ఉన్నట్టు తెలుస్తుంది మరి ఈసారి సినిమాలకు సంబంధించిన సెలబ్రిటీ వస్తారా లేదంటే సీరియల్ సంబంధించిన సెలబ్రిటీ వస్తారా అనేది తెలియాల్సి ఉంది.
అందుతున్న సమాచారం మేరకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ గా సీరియల్ ఫేమస్ అయినా అర్జున్ అంబటి వస్తారని తెలుస్తుంది. మరి ఈ విషయంపై మరో రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం కూడా ఉంది. 1990ల చివరలో మరియు 2000ల ప్రారంభంలో, షకీలా తన సాఫ్ట్ పోర్న్ చిత్రాలతో మలయాళ చిత్ర పరిశ్రమలో ఆధిపత్యం చెలాయించింది. ఆ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో సపోర్టింగ్ రోల్స్‌కి మారింది. తర్వాత ఆ సినిమాలు చేయడం మానేసి కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించింది.