Shankar Comments on Game Changer: ఇండియన్ 2 సినిమా ఫ్లాప్ తర్వాత శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా కైరా అద్వానీ అలాగే అంజలి హీరోయిన్గా వచ్చిన సినిమా గేమ్ ఛేంజర్ ఈ సినిమాని సంక్రాంతికి కానుకగా జనవరి 10 నా విడుదలైన విషయం తెలిసిందే.. అయితే ఈ సినిమాపై మొదటి దగ్గర నుండి ఫ్యాన్స్ కి అలాగే కామన్ ఆడియన్స్ కి భారీ హైప్ ఉండగా… సినిమా విడుదల అవటానికి రెండు రోజులు ముందల నుంచి నెగెటివిటీ స్టార్ట్ చేశారు సోషల్ మీడియాలో.. అయినప్పటికీ సినిమా విజయాన్ని ఎవరు ఆపలేకపోయారు..
Shankar Comments on Game Changer: అయితే మొదటిసారిగా శంకర్ తన స్టోరీ తో కాకుండా వేరొక దర్శకుడు స్టోరీ తో సినిమా తీయడం జరిగింది.. రీసెంట్ గా తమిళ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శంకర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.. శంకర్ మాట్లాడుతూ నిజానికి గేమ్ ఛేంజర్ కి భారీ రన్ టైం తో కూడిన ఫుటేజ్ వచ్చింది అని చాలా సాలిడ్ సీన్స్ ని తాము నిడివి కోసం కట్ చేసేసామని ఈ విషయంలో తను కొంచెం డిజప్పాయింట్ ఉన్నాను..
అయితే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇలాంటివి బయటికి రావటంతో రామ్ చరణ్ ఫాన్స్ చాలా ఆశ్చర్యానికి గురవుతున్నారు.. అంటే గేమ్ చేంజెస్ సినిమాలో ఇంకా భారీ సీన్స్ ఉన్నట్టు తెలుస్తుంది.. ఇక రామ్ చరణ్ తదుపరి సినిమాలకు విషయానికి వస్తే బుచ్చిబాబు దర్శకత్వంలో ఆర్ సి 16 సినిమా ప్రస్తుతం షూటింగు జరుగుతుంది అయితే దీని తర్వాత లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో మరో సినిమా మొదలుపెట్టడానికి సిద్ధమవుతున్నారు…