RC15: రామ్ చరణ్ కోసం శంకర్ ఓ రేంజ్ ప్లానింగ్

Ram Charan – Shankar: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. RC15వ చిత్రంగా దీన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. ఇప్పటికే ఈ క్రేజీ కాంబినేషన్ పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. తామరతంపరగా ఎప్పటికప్పుడు లీకవుతోన్న ఒక్కో అప్ డేట్ అంతకంతకు అంచనాల్ని పెంచేస్తున్నాయి. Ram Charan కోసం Shankar ఓ రేంజ్ ప్లానింగ్ చేస్తున్నాడు అంట .

సంఘంలో ఒక నిజాయితీగల ఐఏఎస్ ఆఫీసర్ రాజకీయనాయకుడిగా టర్న్ అయితే ఎలా ఉంటుంది? అనే ఆసక్తికర పాయింట్ తో కథ సాగుతుందని తెలుస్తోంది. సామాజిక రాజకీయ అంశాల కోణంలో ఎమోషనల్ డ్రైవ్ తో కథ అంతా సాగుతుందని టాక్ వినిపిస్తోంది. కలెక్టర్ గా ఉన్న ఓ యువకుడు సీఎంగా బాధ్యతలు తీసుకుంటే వ్యవస్థ లో లోపాలను సరిచేసి సమర్థంగా ఎలా నడిపించగలడు? అనేది చరణ్ పాత్రలో హైలైట్ గా ఉంటుందని టాక్.

ఈ సినిమాకి మూల కథను కార్తీక్ సుబ్బరాజ్ అందిస్తున్నారని తెలిసింది. ప్రస్తుతం శంకర్ నటీనటులు టెక్నీషియన్ల ఎంపికలో బిజీగా ఉన్నారు. కైరా అద్వాని చిత్రంలో హీరోయిన్ గా ఎంపిక అయినట్టు తెలుస్తుంది. ఈ చిత్రాన్ని దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి ట్రిపుల్ ఆర్ సినిమాతో బిజీగా ఉన్నాడు.

 

Related Articles

Telugu Articles

Movie Articles