టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో శర్వానంద్ ఒకరు. అంతేకాకుండా శర్వా సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలను చేస్తారు. ప్రస్తుతం శర్వానంద్ దాదాపు మూడు నాలుగు సినిమాలను చేస్తున్నారు.
అయితే నేడు శర్వానంద్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్స్ తమతమ సినిమాల నుంచి పోస్టర్లను విడుదల చేశారు. ఇందులో శ్రీకారం, ఆడవాళ్ళు మీకు జోహార్లు కూడా ఉన్నాయి. ఆడవాళ్ళు మీకు జోహార్లు సినిమా టైటిల్ పోస్టర్ ద్వారా టీమ్ శర్వాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ టైటిల్ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోందిన. ఇదిలా ఉంటే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, శర్వానంద్ ఎంత మంచి స్నేహితులో తెలిసిన విషయమే. అయితే నేడు శర్వా పుట్టినరోజు నాడు చెర్రీ స్వయంగా శర్వా చేత కేక్ కటింగ్ చేయించారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.