sharwanand, ajay bhupati mahasamudram announced under ak entertainments

Sharwanand : శర్వానంద్ హీరోగా అజయ్ భూపతి దర్శకుడిగా ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థ కొత్త సినిమాను ప్రకటించింది. RX 100 సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన అజయ్.. ఇప్పుడు మరో పవర్‌ఫుల్ స్టోరీతో వస్తున్నారు. ‘ప్రస్థానం’, ‘గమ్యం’ వంటి చిత్రాల్లో వైవిధ్యభరితమైన పాత్రలను పోషించిన యంగ్ హీరో శర్వానంద్. తన తదుపరి సినిమాను అజయ్ భూపతి దర్శకత్వంలో చేయనున్నాడు.

తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రంలో శర్వాతో పాటు మరో హీరో కూడా కనిపించనున్నట్టు సమాచారం. ఫుల్ ప్యాకేజ్డ్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం వస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం తర్వాత తమ బ్యానర్ నుంచి వస్తున్న మరో క్రేజ్ ప్రాజెక్ట్ అని తెలిపింది. మ‌రోసారి ఆడియెన్స్‌ను అబ్బుర‌పరిచే ప‌వ‌ర్‌ఫుల్ స్క్రిప్టును ఈ సినిమా కోసం రెడీ చేశారు.

ఈ సినిమా కథను ముందుగా రవితేజకు వినిపించాడు అజయ్. ఏమైందో ఏమో రవితేజతో ఆ సినిమా వర్కౌట్ కాలేదు. దీంతో ఆ సినిమా కథ శర్వానంద్‌కి వినిపిస్తే.. ఫైనల్‌గా శర్వా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు. అందులో భాగంగా ఈ సినిమాకు సంబందించిన అధికారిక ప్రకటన వెలువడింది. ఈ సినిమాకు సంబంధించి ప్రతి వారం ఒక అప్‌డేట్ రానుంది.