Sharwanand, Kajal Aggarwal Ranarangam Release Date
Sharwanand, Kajal Aggarwal Ranarangam Release Date

తెలుగులో చెప్పిన టైం కి సినిమా రిలీజ్ చెయ్యకపోవడం అనే ఆనవాయితీ శర్వానంద్ కి కూడా అంటుకుంది.ముందు అసలు డేట్ ఎందుకు ఇస్తారో?,తరువాత ఎందుకువాయిదా వేస్తారో అనే దానికి కారణం కనీసం వాళ్ళకయినా తెలుసా అనేది సగటు ప్రేక్షకుడి ప్రశ్న.శర్వానంద్ సినిమా రణరంగం ఆగస్టు 2 న రిలీజ్ అని టీజర్ లోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసారు.ఇస్మార్ట్ శంకర్ పంచాయితీవల్ల రాక్షషుడు కూడా ఆగస్టు 2 ని టార్గెట్ చేసాడు.

[INSERT_ELEMENTOR id=”3574″]

అయినా కూడా అప్పుడు తన సినిమా డేట్ మార్చేదే లేదు అన్న శర్వా ఇప్పుడు మాత్రం వెనక్కు వెళుతున్నాడు.ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పూర్తికాలేదు అనే స్టాండర్డ్ సాకు రెడీ గా ఉంది.అయితే ఇక్కడ ఇంకో మెలిక ఏంటంటే సినిమాకి శర్వా కూడా కొన్ని కరెక్షన్స్ చెప్పాడట.అవి పూర్తయ్యాకే సినిమాని రిలీజ్ చెయ్యాలి అనేది అతని కండిషన్.ఇలా హడావిడిగా సినిమా రిలీజ్ చెయ్యడం ఇష్టం లేక సినిమా వాయిదా వేశారు అని అంటున్నారు.ఆ తర్వాత మన్మధుడు-2,సాహో సినిమాలు ఉన్నాయి కాబట్టి రణరంగం సెప్టెంబర్ లో రిలీజ్ అవ్వొచ్చు.

[INSERT_ELEMENTOR id=”3574″]