Homeసినిమా వార్తలుగాయనిగా మారిన నిత్యా మీనన్..!

గాయనిగా మారిన నిత్యా మీనన్..!

Gamanam Nithya Menen First Look: ప్రస్తుతం తెలుగుతో పాటు హిందీ మిగతా దక్షిణాది భాషల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘గమనం’. ఇప్పటికే శ్రియ ఫస్ట్ లుక్ విడుదల చేసిన చిత్ర బృందం తాజాగా నిత్య మేనన్ లుక్‌ను ఐదు భాషల్లో విడుదల చేసారు. శైలపుత్రీ దేవిగా దర్శనమిస్తున్నారు. ‘గమనం’ సినిమా కోసం ఆమె శైలపుత్రీ దేవిగా మారారు.

లేడీ డైరెక్టర్ సుజ‌నా రావు దర్శకత్వం వహిస్తోన్న తొలి చిత్రం ‘గ‌మ‌నం’. తెలుగు, త‌మిళం, క‌న్నడ‌, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో పాన్ ఇండియా ఫిల్మ్‌గా నిర్మితమవుతోంది. రియ‌ల్ లైఫ్ డ్రామాగా ‘గ‌మ‌నం’ రూపొందుతోంది. ఇప్పటికే శ్రియ ఫస్ట్ లుక్ విడుదల చేసిన చిత్ర బృందం తాజాగా నిత్య మేనన్ లుక్‌ను ఐదు భాషల్లో విడుదల చేసారు.

పోస్టర్‌లో శాస్త్రీయ గాయ‌నిగా ప‌ట్టుచీర ధ‌రించి ఒక క‌చేరీలో గానం చేస్తూ నిత్యా మీనన్ కనిపించారు. నిత్యా మీన‌న్ ముఖంలో అంద‌మైన చిరున‌వ్వుతో పాటు ఒక దైవ‌త్వం కూడా గోచ‌రిస్తోంది. ఈ లుక్‌లో నిత్య మేనన్.. లుక్‌కు మంచి రెస్సాన్స్ వస్తోంది. ప్రముఖ ర‌చ‌యిత సాయిమాధ‌వ్ బుర్రా సంభాష‌ణ‌లు రాస్తున్న ‘గ‌మ‌నం’ చిత్రానికి మేస్ట్రో ఇళ‌య‌రాజా సంగీతం స‌మ‌కూరుస్తున్నారు. మిగ‌తా తారాగ‌ణం, సాంకేతిక నిపుణుల వివ‌రాలు త్వర‌లో వెల్లడించ‌నున్నారు.

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY