Sharwanand Next movie sreekaram first look poster release
Sharwanand Next movie sreekaram first look poster release

(Sharwanand Next movie sreekaram first look poster release, Priyanka Arul Mohan and sharwanand next movie latest updates)యంగ్ హీరో శర్వానంద్ నటిస్తోన్న లేటెస్ట్ ఫిల్మ్ ‘శ్రీకారం’. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ మూవీ చివరి దశ షూటింగ్ జరుగుతోంది. ‘గ్యాంగ్ లీడర్’ ఫేమ్ ప్రియాంకా అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను కిషోర్ బి. డైరెక్ట్ చేస్తున్నారు. 14 రీల్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ తాలూకా ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది.

ఈ పోస్టరులో శర్వానంద్ ఇప్పటి దాకా కనిపించని డిఫరెంట్ లుక్ లో, గళ్ల లుంగీ కట్టుకొని, భుజాన నల్లటి కండువా వేసుకొని, వరి పొలాల మధ్య నడచుకొని వెళ్తూ కనిపిస్తున్నాడు. దీన్ని బట్టి ఆయన రైతు పాత్రను పోషిస్తున్నాడని ఊహించవచ్చు. అందమైన గ్రామీణ నేపథ్యంలో ఈ సినిమా తయారవుతున్నదని ఈ పోస్టర్ తెలియజేస్తోంది. శర్వానంద్ ముఖంలో కాంతి చూస్తుంటే, అతను తన జీవితంలోని ఒక కీలక ఘట్టానికి ‘శ్రీకారం’ చుట్టాడని అనిపిస్తోంది.

ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు. ‘గద్దలకొండ గణేష్’ వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత వాళ్లు నిర్మిస్తోన్న రెండో సినిమా ఇది. సాయిమాధ‌వ్ బుర్రా డైలాగ్స్ రాస్తున్నారు. మిక్కి జె.మేయ‌ర్ సంగీత సార‌థ్యం వ‌హిస్తున్నారు. యువ‌రాజ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సమ్మర్ కానుకగా ఈ మూవీ రిలీజ్ కాబోతుంది.