Sharwanand Ranarangam Official Teaser Talk,
Sharwanand Ranarangam Official Teaser Talk,

[INSERT_ELEMENTOR id=”3574″]

రణరంగం….శర్వానంద్ లేటెస్ట్ మూవీ ఇది.టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న సుధీర్ వర్మ ఈ సినిమా డైరెక్టర్.ఈ సినిమా నుండి గతంలో లీక్ అయిన శర్వానంద్ స్టిల్స్ ఈ సినిమాపై ఆసక్తి పెంచాయి.ఫస్ట్ లుక్ అండ్ సినిమా టైటిల్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించాయి.

టీజర్ లో శర్వా రెండు పాత్రలలో కనిపించాడు.అయితే రెండూ కూడా డాన్ తరహా పాత్రలే.ఆ రెండు పాత్రల మధ్య సంబంధం బహుశా తండ్రి కొడుకులు అయ్యుండొచ్చు.ఇక ప్రెజెంట్ జెనరేషన్ లో ఉన్న శర్వా తో కాజల్ రొమాన్స్ చేస్తుంది.90’స్ బ్యాక్ డ్రాప్ లో ఉన్న శర్వా కి జోడిగా కళ్యాణి ప్రియదర్శిని కనిపించింది.ఈ సినిమా కోసం స్పెషల్ గా భారీ ఖర్చుతో వేసిన పోర్ట్ సెట్,దాంట్లో తీసిన సీన్స్ అన్నీ చాలా బావున్నాయి.

[INSERT_ELEMENTOR id=”3574″]

కాలేకపోతే టీజర్ మొత్తం చూస్తే ఆంధ్రావాలా పోలికలు కూడా కనిపిస్తున్నాయి.కాకపోతే సుధీర్ వర్మ కథలో ఖచ్చితంగా ఎదో ఒక మ్యాజికల్ ఎలిమెంట్ పెట్టుకుని ఉంటాడు.టేకింగ్ అతని స్టైల్ లో అదిరిపోయింది.దివాకర్ మణి సినిమాటోగ్రఫీ,ప్రశాంత్ పిళ్ళై మ్యూజిక్ సినిమా స్థాయిని పెంచేలా ఉన్నాయి.మొత్తానికి రణరంగం టీజర్ తో ఇంటెన్సిటీ ఉన్న స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ లో అలరించడానికి రెడీ అని కన్వే చేసాడు శర్వానంద్.ట్రైలర్ చూస్తే ఈ సినిమా గురించి మరింత బెటర్ అంచనాకి రావచ్చు.

[INSERT_ELEMENTOR id=”3574″]