షూటింగ్ కంప్లీట్ చేసుకున్న శ‌ర్వానంద్‌, సిద్ధార్ధ్ మహా సముద్రం

0
19
Maha Samudram shoot wrapped

Mahasamudram: ప్రామిసింగ్ యాక్ట‌ర్స్ శ‌ర్వానంద్‌ (Sharwanand), సిద్ధార్ధ్ (Siddharth), టాలెంటెడ్ డైరెక్ట‌ర్ అజ‌య్ భూప‌తి, ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంట‌ర్‌టైన్ మెంట్స్ క‌లిసి ప్ర‌స్తుతం అంద‌రూ ఎంత‌గానో ఎదురుచూస్తున్న `మ‌హాస‌ముద్రం` చిత్రాన్ని ఒక మాస్ట‌ర్‌పీస్‌గా రూపొందిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలను తెర‌కెక్కించారు మేక‌ర్స్ దీంతో `మ‌హా స‌ముద్రం` (Mahasamudram)మూవీ షూటింగ్ (shooting) పూర్త‌య్యింది.

ఇది క‌థా ర‌చ‌యిత‌, ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తికి డ్రీమ్ ప్రాజెక్ట్. ప్ర‌తి క్యారెక్ట‌ర్‌కు ఎంతో ప్రామ‌ఖ్య‌త ఉండ‌బోతుంది. దానిలో భాగంగానే ఇప్ప‌టికే విడుద‌ల‌చేసిన శ‌ర్వానంద్‌, సిద్దార్ధ్‌, అధితిరావు హైద‌రి, అనూ ఇమాన్యూయేల్, జ‌గ‌ప‌తిబాబు, రావు ర‌మేష్, గ‌రుడ రామ్‌ ఫ‌స్ట్‌లుక్స్‌కి అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌నుండి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

Siddharth and Sharwanand’s Maha Samudram shoot wrapped

కేవ‌లం ఈ క్రేజీ కాంబినేష‌న్‌ని క్యాష్ చేసుకోవ‌డ‌మే కాదు ఒక ప‌ర్‌ఫెక్ట్ కమర్షియల్ చిత్రానికి అవసరమైన అన్ని అంశాల‌తో రెగ్యుల‌ర్ మాస్ ఎంట‌ర్ చిత్రాల‌కు భిన్నంగా ఒక డిఫ‌రెంట్ కంటెంట్‌తో ఈ మూవీ తెర‌కెక్కుతోంది. థియేట్రిక‌ల్ రిలీజ్‌కోసం సిద్ద‌మ‌వుతున్న `మ‌హాస‌ముద్రం` ప్ర‌మోష‌న్స్ అతి త్వ‌ర‌లో ప్రారంభంకానున్నాయి.