Shekar Telugu Review & Rating : 2.75/5
నటీనటులు: డా.రాజశేఖర్, శివాని రాజశేఖర్, అభినవ్ గోమతం, కన్నడ కిషోర్, సమీర్, భరణి, రవివర్మ, శ్రవణ్ రాఘవేంద్ర
దర్శకత్వం : జీవిత రాజశేఖర్
నిర్మాత: బీరం సుధాకర రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, బొగ్గరం వెంకట శ్రీనివాస్.
సంగీత దర్శకుడు: అనూప్ రూబెన్స్
‘యాంగ్రీ యంగ్ మ్యాన్’ నుంచి ‘యాంగ్రీ స్టార్’ గా అప్ డేట్ అయిన రాజశేఖర్ నుంచి వచ్చిన కొత్త మూవీ ‘శేఖర్’. జీవితా రాజశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఈ రోజు రిలీజ్ అయ్యింది. మరి సినిమాలో మ్యాటర్ ఉందా ? బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం వర్కౌట్ అవుతుందా ? లేదా ? అనేది రివ్యూలోకి వెళ్లి చూద్దాం.
కథ:
శేఖర్ (రాజశేఖర్) హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటాడు. గతం తాలూకు బాధను మర్చిపోలేక మత్తుకు బానిస అయ్యి, జీవితాన్ని వృధా చేసుకుంటూ కాలం వెళ్లదీస్తూ ఉంటాడు. అయితే, శేఖర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ లో బెస్ట్, కేసులను చేధించడంలో శేఖర్ మంచి ఎక్స్ పర్ట్. డిపార్ట్మెంట్ కోసం కొన్ని కేసులను డీల్ చేస్తుంటాడు. అయితే, శేఖర్ మాజీ భార్య ఇందు (ఆత్మీయ రాజన్)కి యాక్సిడెంట్ అవుతుంది.
సిటీ హాస్పిటల్ లో ఆమె తన ప్రాణాలను కోల్పోతుంది. శేఖర్ కూతురు గీత (శివాని రాజశేఖర్) కూడా గతంలో ఇదే హాస్పిటల్ లో చనిపోతుంది. దాంతో శేఖర్ కి అనుమానం కలుగుతుంది. వారి చావుల పై తన ఇన్వెస్టిగేషన్ ని మొదలు పెడతాడు. ఇంతకీ వాళ్ళు ఎలా చనిపోయారు ? వాళ్ళ చావులకు ఆ హాస్పిటల్ కి మధ్య కనెక్షన్ ఏమిటి ? శేఖర్ దాన్ని ఎలా బయట పెట్టాడు ? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ :
జీవితంలో జరిగిన కొన్ని బాధాకరమైన సంఘటనల కారణంగా శేఖర్ (రాజశేఖర్) ఏమి చేశాడు ? ఈ కోణంలో వచ్చే ఎమోషనల్ ట్రాక్ సినిమాలో చాలా బాగా కుదిరింది. ఇక మధ్య మధ్యలో శేఖర్ ఎదుర్కొన్న సమస్యలు కూడా సినిమా స్థాయిని పెంచాయి. రాజశేఖర్ నటన కూడా చాలా బాగుంది. తనకు ఈ సినిమా కీలకం కావడంతో.. రాజశేఖర్ తన పాత్ర పై ప్రత్యేక శ్రద్ధ చూపించాడు. హీరోయిన్ గా నటించిన ముస్కాన్ కూడా చాలా బాగా నటించింది.
ముఖ్య పాత్రలో నటించిన శివాని రాజశేఖర్ కూడా తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. ఇక టెక్నికల్ గా చూసుకుంటే.. ఈ సినిమా మరో మెట్టు పైనే ఉంది. కాకాపోతే, ప్లే కన్ ఫ్యూజన్ గా ఉండటంతో బి.సి ఆడియన్స్ కు ఈ శేఖర్ సినిమా పూర్తి స్థాయిలో కనెక్ట్ కాదు. జీవిత రాజశేఖర్ రాసుకున్న స్క్రీన్ ప్లే అంత గొప్పగా ఏమి లేదు.
మెయిన్ గా సినిమాలో అంత హెవీ డ్రామా సృష్టించిన తర్వాత, ఆ గ్రాఫ్ ను అలాగే కంటిన్యూ చేయాలి. ఈ విషయంలో జీవిత రాజశేఖర్ పూర్తిగా విఫలం అయ్యింది. అలాగే ప్రేక్షకులను నిరాశపరిచే విధంగా సినిమాను సాధారణ ఎండింగ్ తో ముగించడం కూడా శేఖర్ కు మరో పెద్ద మైనస్.
ప్లస్ పాయింట్స్ :
రాజశేఖర్, ప్రకాష్ రాజ్ నటన,
కథాంశం.
సాంకేతిక విలువలు
సెకండ్ హాఫ్
మైనస్ పాయింట్స్:
కథాకథనాలు,
లాజిక్ లెస్ ఎమోషనల్ స్టోరీ,
కీలక అంశాలను మిస్ చేయడం,
అక్కడక్కడ కన్ ఫ్యూజన్ గా ఉండటం,
క్రైమ్ డ్రామాలో లాజిక్ మిస్ అవ్వడం.
తీర్పు :
మెడికల్ క్రైమ్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ భిన్నమైన క్రైమ్ డ్రామాలో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఆర్గాన్స్ కి సంబంధించిన డార్క్ క్రైమ్ డ్రామాల గురించి సినిమాలో చాలా బాగా చూపించారు. అలాగే, రాజశేఖర్ నటన కూడా మెప్పిస్తోంది. కానీ, రెగ్యులర్ కమర్షియల్ సినిమాల లవర్స్ కి మాత్రం, శేఖర్ చిత్రం కనెక్ట్ కాదు. ఓవరాల్ గా ఈ చిత్రం ఎవరైనా ఒకసారి చూడొచ్చు.