Shirley Setia Finalized As Lead Actress In Naga Shaurya Next

టాలీవుడ్ యువ హీరో నాగ శౌర్య వరుస కథలను ఓకే చేస్తూ దూసుకుపోతున్నాడు. సినిమా సినిమాకు వైవిద్యం ఉండేలా ప్లాన్ చేస్తుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ‘ఛలో’ సినిమా తర్వాత వరుస పరాజయాలతో సతమతమవుతున్న నాగ శౌర్య కొంచెం గ్యాప్ తీసుకోని తన సొంత బ్యానర్ లో ‘అశ్వత్థామ’ సినిమా చేసాడు. రమణ తేజ దర్శకత్వం అందించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు మళ్ళీ తన సొంత బ్యానర్ లోనే మరొక సినిమా చేయనున్నాడు.

టాలెంటెడ్ డైరెక్ట‌ర్ అనీష్ కృష్ణ కాంబినేష‌న్‌లో ఐరా క్రియేష‌న్స్ ఓ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌ను ఇటీవ‌ల లాంచ్ చేసిన విష‌యం తెలిసిందే. ఇంకా టైటిల్ నిర్ణ‌యించ‌ని ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ డిసెంబ‌ర్ నుంచి జ‌ర‌గ‌నుంది. ఆక్లాండ్‌కు చెంది, ఫోర్బ్స్ మ్యాగ‌జైన్‌లో స్థానం పొందిన సంచ‌ల‌న గాయ‌ని, న‌టి షిర్లీ సేతియా ఈ మూవీలో నాగ‌శౌర్య జోడీగా ఎంపిక‌య్యారు. నెట్‌ఫ్లిక్స్ ఫిల్మ్ ‘మ‌స్కా’తో న‌టిగా మారిన షిర్లీ, త్వ‌ర‌లో ‘నిక‌మ్మా’ చిత్రంతో బాలీవుడ్‌లోనూ ప‌రిచ‌యం అవుతున్నారు.

ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొంద‌నున్న ఈ చిత్రాన్ని ఉష ముల్పూరి నిర్మిస్తున్నారు. ద‌ర్శ‌కునిగా అనీష్ కృష్ణ‌కు ఇది మూడో సినిమా. మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్ సంగీతం స‌మ‌కూరుస్తుండ‌గా, సాయి శ్రీ‌రామ్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు.

Shirley Setia Finalized As Lead Actress In Naga Shaurya, Aneesh Krishna, IRA Creations Film