Homeసినిమా వార్తలుచక్రవర్తి శివరాజ్ కుమార్ ఘోస్ట్ పోస్టర్ విడుదల

చక్రవర్తి శివరాజ్ కుమార్ ఘోస్ట్ పోస్టర్ విడుదల

Shivarajkumar Ghost Movie: కరుణడ చక్రవర్తి డాక్టర్ శివరాజ్ కుమార్ కొత్త చిత్రం ‘ఘోస్ట్’ పాన్ ఇండియా ఫిలిం గా కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో భారీ స్థాయిలో  తెరకెక్కనుంది. యాక్షన్ హైస్ట్ థ్రిల్లర్ గా రూపొందనున్న ఈ చిత్రానికి కన్నడ బ్లాక్ బస్టర్ ‘బీర్బల్’ చిత్ర దర్శకుడు శ్రీని దర్శకత్వం వహిస్తుండగా, ప్రముఖ రాజకీయనాయకులు, నిర్మాత సందేశ్ నాగరాజ్ తన సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

విజయదశమి శుభాకాంక్షలు తెలుపుతూ ఘోస్ట్ (Ghost) చిత్ర బృందం కొత్త పోస్టర్ ను విడుదల చేశారు. దసరా పండుగను తెలుపుతూ విల్లు, బాణాల ఎంబ్లెమ్ తో ఉన్న ఒక పొడవాటి కార్ తో ఉన్న పోస్టర్ చూడగానే ఆకట్టుకునేలా డిజైన్ చేశారు. ఘోస్ట్ చిత్రం ప్రారంభోత్సవం భారీ వేడుకగా ఈ నెల, అక్టోబర్ 12న జరుగనుంది.

‘ఘోస్ట్’ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. మస్తీ, ప్రసన్న వి ఎం డైలాగ్స్ రాస్తున్నారు. కె జి ఎఫ్ తో దేశవ్యాప్తంగా  గుర్తింపు తెచ్చుకున్న ఆర్ట్ డైరెక్టర్ శివ కుమార్ ఈ సినిమాకి పనిచేస్తున్నారు. పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ జన్య సంగీతాన్ని అందిస్తున్నారు. కన్నడ లో టాప్ స్టార్స్, టెక్నిషన్స్ తో చిత్రాలు తీసే సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత సందేశ్ నాగరాజ్ ‘ఘోస్ట్’ ని ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY