సెకండ్ సినిమాతోనే బంపర్ ఆఫర్ కొట్టేసిన శివాత్మిక

shivathmika rajasekhar next movie under Krishna Vamsi Rangamarthanda movie
shivathmika rajasekhar next movie under Krishna Vamsi Rangamarthanda movie

ఇటీవల విడుదలైన దొరసాని మూవీతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన భామ సీనియర్ హీరో జీవితా రాజశేఖర్ తనయ అయిన శివాత్మిక. ఈ మూవీలో శివాత్మిక తనదైన శైలీలో నేచురల్ గా నటించి.. అందరి మన్నలను పొందుకుంది. ఎంత పెద్ద స్టార్ హీరోహీరోయిన్ అయినా తమ కెరీర్లో ఒక్కసారైనా కృష్ణవంశీ దర్శకత్వంలో నటించాలి అనుకుంటారు. సినిమా రిజల్ట్ ను పక్కన పెడితే ప్రతి ఆర్టిస్ట్ లోని ఉత్తమ నట ప్రతిభను ప్రేక్షకులకు పరిచయం చేయగల సత్తా ఉన్న అతికొద్దిమంది దర్శకధీరుల్లో కృష్ణవంశీ ఒకరు. ఆయన చాలా గ్యాప్ అనంతరం తెరకెక్కిస్తున్న “రంగమార్తాండ” చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఇటీవల మొదలైన విషయం తెలిసిందే.

అయితే తాజాగా శివాత్మిక మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే సీనియర్ దర్శకుడు కృష్ణవంశీ నేతృత్వంలో రమ్యకృష్ణ ,ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న రంగమార్తాండ మూవీలో ఈ అమ్మడుకు అవకాశం లభించినట్లు సమాచారం. మరో కీలకపాత్రను హాస్యబ్రహ్మ బ్రహ్మానందం పోషించనున్నారు. శివాత్మిక ఈ చిత్రంలో ఆమె ఒక గాయకురాలి పాత్ర పోషించనుంది.