HomeBigg Boss 7 Teluguయావర్ రెండో కెప్టెన్.. ఈవారం ఎలిమినేషన్ కూడా లేడీ కంటెస్టెంటే.?

యావర్ రెండో కెప్టెన్.. ఈవారం ఎలిమినేషన్ కూడా లేడీ కంటెస్టెంటే.?

Bigg Boss 7 Telugu This week Voting, Bigg Boss 7 telugu second captain, Shobha Shetty eliminated 6th week from Bigg Boss house, 6th week elimination contestant

Bigg Boss 7 Telugu This week Voting, Bigg Boss 7 telugu second captain, Shobha Shetty eliminated 6th week from Bigg Boss house, 6th week elimination contestant

బిగ్ బాస్ 7 తెలుగు ఆరో వారం చివరి దశకు చేరుకుంది.. నిన్న జరిగిన కెప్టెన్సీ పోటీలో బిగ్ బాస్ హౌస్ రెండో కెప్టెన్ గా యావర్ సెలెక్ట్ అవటం జరిగింది. యావర్ కెప్టెన్సీ పదవి కోసం శివాజీ అలాగే టేస్టీ తేజ బాగానే కష్టపడ్డారు. నిన్న జరిగిన బెలూన్ టాస్క్ లో తేజ కి అలాగే అమర్ కి కొంచెం గొడవ జరగగా మిగతాదంతా సజావుగానే సాగింది. యావర్ మొదటి దగ్గర నుండి బాగానే గేమ్ లో ఆడుతున్నాడు.. అలాగే పవర్ హస్త్రా కోసమని మొదటిగా చాలా ప్రయత్నం చేశాడు.. కానీ రెండో పవర్ హస్త్రాన్ని దక్కించుకున్నాడు.. అలాగే ఇప్పుడు మొదటి కెప్టెన్సీ కాకుండా హౌస్ లో రెండో కెప్టెన్ దారుడిగా గెలవడం జరిగింది.

ఇక ఆరవ వారం బిగ్ బాస్ 7 తెలుగు (Bigg Boss 7 Telugu) హౌస్ నుండి బయటకు వెళ్లడానికి నామినేట్ అయిన 7 ఇంటి సభ్యుల్లో ఈవారం ఎవరు ఎలిమినేట్ అవుతున్నారా అనే విషయానికి వస్తే.. ఈవారం బిగ్ బాస్ ఓటింగ్ జరిగిన దాని ప్రకారం.. యావర్ అలాగే అమర్ మొదటి రెండు స్థానాల్లో ఉండగా చివరి మూడు స్థానాల్లో అశ్విన, పూజా మూర్తి ఇంకా శోభాశెట్టి డేంజర్ జోన్ లో ఉన్నారు మరి వీళ్ళతోపాటు టేస్టీ తేజ కూడా అటు ఇటుగా డేంజర్ జోన్ లో ఉన్నట్టే తెలుస్తుంది.

ఇక్కడ విశేషమేమిటంటే ఈవారం ఎలిమినేషన్ ఉంటుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.. ఎందుకంటే నాగార్జున ఈ వారం హోలోగ్రామ్ ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టి ఎలిమినేషన్ చేస్తారు అనే ప్రచారం అయితే జరుగుతుంది.. లేదా ఈ వారం ఎలిమినేషన్ ఉండకపోవచ్చు వచ్చేవారం డబల్ ఎలిమినేషన్ చేస్తారు అంటూ ప్రచారం కూడా ఉంది. ఇక ఏది ఏమైనా ఒకవేళ ఈవారం ఎలిమినేషన్ ఉంటే కనుక గత ఐదు వారాలుగా లేడీ కంటెస్టెంటే హౌస్ నుండి బయటకు వెళ్లడం ఎలా జరిగిందో అదేవిధంగా శోభా శెట్టి హౌస్ నుండి ఎలిమినేట్ అయినట్టు తెలుస్తుంది.

నిన్న జరిగిన కెప్టెన్సీ పోటీదారుల్లో శోభా శెట్టి కెప్టెన్సీ పదవికి అరువుగారాలు కాదు అంటూ అందరూ ఓటు వేయటం చూశారు.. ఒకానొక దశలో శోభ కెప్టెన్సీ అయి ఓటింగ్ ప్రకారం కాకుండా బిగ్ బాస్ ఇచ్చే ట్విస్ట్ ప్రకారం హౌస్ లో ఉంటుందని అందరు భావించారు.. కానీ కెప్టెన్సీ పదవి రాకపోవడంతో శోభా శెట్టి నే హౌస్ నుండి బయటికి వెళ్లే పోటీదారులుగా నియమించినట్టు తెలుస్తుంది. మరి ఆదివారం జరగబోయే ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఏదైనా ట్విస్ట్ ఇస్తారా లేదంటే శోభా శెట్టి ని ఎలిమినేట్ చేస్తారా అనేది చూడాలి..

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY