Sobhita Dhulipala Finally Reacts To Rumors On Naga Chaitanya: ఎంతో అన్యోన్యంగా సాగుతున్న సమంత నాగచైతన్య డైవర్స్ విషయం అందరిని ఆశ్చర్యానికి ముంచెత్తిన సంగతి తెలిసిందే. మీరు ఇద్దరు విడిపోవడానికి ప్రధాన కారణం హీరోయిన్ శోభిత ధూళిపాల అని చాలామంది భావిస్తుంటారు. హీరో నాగచైతన్య తో ఆమె డేటింగ్ విషయం ఎప్పుడూ న్యూస్ లో సెన్సేషన్ గాని ఉంది. ఇటు దక్షిణాది అటు ఉత్తరాది లో రాణిస్తూ అందరిని ఆకట్టుకుంటున్న హీరోయిన్ శోభిత ధూళిపాలతో నాగచైతన్య డేటింగ్ చేస్తున్నట్లు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి.
Naga Chaitanya – Shobita Dhulipala:అయితే ఇప్పటివరకు వీటి గురించి నాగచైతన్య కానీ.. శోభిత కానీ ఎటువంటి రెస్పాన్స్ ఇచ్చింది లేదు. అయితే తాజాగా ఓ లైఫ్ స్టైల్ ఈవెంట్లో పాల్గొన్న ఈ బ్యూటీ తన డేటింగ్ రూమర్స్ పై కుండబద్దలు కొట్టింది. తన పై బయట వినిపిస్తున్న వార్తలకు తనకు సంబంధం లేదని శోభిత తేల్చి చెప్పింది. కాబట్టే తనపై వస్తున్న రూమర్స్ కి ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వాలి అని తను అనుకోలేదని కూడా చెప్పింది.
తప్పు చేయనప్పుడు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని…కానీ ఎటువంటి తప్పు చేయలేదు కనుక ఎవరికీ సంజాయిష ఇచ్చుకోవాల్సిన పనిలేదని.. ముఖ్యంగా మీడియా ముందుకు వచ్చి వివరణ ఇవ్వాలి అని తను అసలు అనుకోలేదని ఆమె అన్నారు. లైఫ్ స్టైల్ ఎంతో ప్రశాంతంగా ఉంచుకోవాలి అనేది తన ఆలోచన కాబట్టి ఫోకస్ కూడా అలాగే ఉంటుంది అని ఆమె పేర్కొన్నారు.
ఏదైతేనేం మొత్తానికి నాగచైతన్యతో డేటింగ్ అనే విమర్శి మాత్రం శోభిత ప్రస్తుతానికి క్లారిటీగా వివరణ ఇచ్చేసింది. ఇకనైనా నాగచైతన్య శోభిత మధ్య జరుగుతున్న డేటింగ్ ఉమర్స్ కు బ్రేకులు పడతాయో లేదో చూడాలి. రీసెంట్గా విడుదలైన పొన్నియిన్ సెల్వన్ 2లో శోభిత ధూళిపాల జయం రవికి జంటగా నటించారు. ఓవైపు సినిమాలు చేస్తూ మరోవైపు ఓటీటీతో ఫుల్ బిజీగా ఉన్న ఈ బ్యూటీ తెలుగు నేలతో తనకున్న అనుబంధాన్ని ఎప్పటికీ మర్చిపోలేను అని గుర్తు చేసుకోవడం విశేషం.
Web Title: Shobitha clarifies about dating rumours with chaitu Naga Chaitanya – Shobita Dhulipala, Sobhita Dhulipala Finally Reacts To Rumors On Naga Chaitanya, Shobita Dhulipala and Naga Chaitanya photos