షాకింగ్ వసూళ్లు `30రోజుల్లో ప్రేమించడం ఎలా` తొలి రోజు

యాంకర్ ప్రదీప్ చాలా కాలం పాటు యాంకర్ గా అలరిస్తూ తనదైన ముద్ర వేసుకున్నాడు. అపారమైన ప్రేక్షకాభిమానాన్ని సాధించాడు. ఇక యాంకర్ గా ముద్ర వేసుకున్న ప్రదీప్ ఇప్పుడు హీరోగా మారి మన ముందుకు వచ్చాడు.యాంకర్ ప్రదీప్ హీరోగా నటించిన మొదటి సినిమా “30రోజుల్లో ప్రేమించడం ఎలా?” మొత్తానికి శుక్రవారం రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మున్నా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అమృతా అయ్యర్ హీరోయిన్‌గా నటించించింది.

Also Read: Prabhas Salaar Movie Shooting Photos

మంచి ఆదరణ సంపాదించుకుంది. ఈ సినిమా తొలి రోజు నాలుగు కోట్ల రూపాయల గ్రాస్ సాధించింది. తన తొలి చిత్రానికి మంచి ఆదరణ రావడంతో ప్రదీప్ సంతోషం వ్యక్తం చేశాడు. సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ధర 4కోట్లకు పైగానే పలికినట్లు సమాచారం. ఇక ప్రదీప్ కి వున్న సూపర్ క్రేజ్ తో పాటు సినిమాకు నీలీ నీలి ఆకాశం పాటతో వచ్చిన క్రేజ్ కూడా బాగానే ఉపయోగపడింది.

shocking collections for Pradeep 30 rojullo preminchadam ela movie

ఇక ఏరియాల వారిగా వచ్చిన మొత్తం షేర్స్ ఈ విధంగా ఉన్నాయి.నైజాం లో 60 లక్షలు, సీడెడ్ లో 24 లక్షలు,ఉత్తరాంధ్రలో 17 లక్షలు, ఈస్ట్ గోదావరిలో 14 లక్షలు, వెస్ట్ గోదావరిలో 12.5 లక్షలు,కృష్ణ జిల్లాలో 10 లక్షలు,గుంటూరు జిల్లాలో 19.1 లక్షల వసూళ్ళని ఈ సినిమా రాబట్టింది.ఆంధ్రప్రదేశ్, తెలంగాణా కలిపి మొత్తంగా 1 కోటి 69 లక్షల షేర్ వసూళ్ళని ఈ సినిమా సాధించింది.

అందరి సహకారంతోనే తన ఇన్ని రోజుల కల నెరవేరిందని పేర్కొన్నాడు. అద్భుతమైన ఓపెనింగ్స్ లభించినందుకు సంతోషంగా ఉందన్నాడు. ఈ మేరకు ఓ లేఖను తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశాడు.

- Advertisement -

 

 

Related Articles

Telugu Articles

Movie Articles